
ఎంపీ మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని తిరుమల పాదయాత్ర
రొంపిచెర్ల: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ అన్నమ్మయ్య జిల్లా పీలేరు నియోజక వర్గం నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పాద యాత్ర చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా రొంపిచెర్ల జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్ రెడ్డి వారికి స్వాగతం పలికి, తన మద్దతు తెలిపారు. విద్యార్థి సంఘం నాయకులు మాట్లడుతూ సూపర్‌సిక్స్ పథకాలను బయట పెడుతున్నారనే వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. ఈ పాదయాత్రలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి, అధికార ప్రతినిధి సుంకర చక్రధర్, మహిళ విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లీశ్వరి, మైనార్టీ మహిళా విభాగం నియోజక వర్గం కార్యదర్శి శాన్వాస్ బేగం, నేతలు లోకనాథరెడ్డి, భువనేశ్వర్ రెడ్డి, కాలనీ చిన్ని, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, షాకీర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాముల పూజలు
రొంపిచెర్ల: అక్రమ మద్యం కేసులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ రొంపిచెర్ల మండలం మోటుమల్లెల శివాలయంలో అయ్యప్ప స్వాములు సోమవారం పూజ లు చేసి, కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డిశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీతో పని చేస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డిపై అక్రమంగా మద్యం కేసు పెట్టి, అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీకాంత్, అమరనాథరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు.