
భార్య హత్య కేసులో భర్త అరెస్టు
బంగారుపాళెం: భార్యను హత్య చేసిన సంఘటనలో సోమవారం భర్తను అరెస్టు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని కొదలమడుగు గ్రామం బీసీ కాలనీకి చెందిన హరిబాబు ఈ నెల 16 వతేదీన తన భార్య ప్రియాంకను హత్య చేసిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసుకు సంబంధించి హరిబాబును మొగిలి గ్రామం వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచినట్లు తెలిపారు.
శ్రీగంధం చెక్కల పట్టివేత
గుడుపల్లె: తమిళనాడు రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తులు గుడివంక అటవీ ప్రాంతంలో శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా తరలిస్తున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గుడుపల్లె జెడ్పీ హైస్కూల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు వాహనాల్లో వస్తుండగా పట్టుకున్నారు. వారివద్ద 6.5 కిలోల శ్రీగంధపు దిమ్మెలు ఉండగా గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోవిందరాజులు, తిరుపతి, రామలింగం, శివశక్తి అని తెలిసింది. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
అనుమానాస్పదస్థితిలో
వివాహిత మృతి
కుప్పంరూరల్: ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన కుప్పం మండలం, తంబిగానిపల్లిలో సోమవారం చోటు చే సుకుంది. కుప్పం సీఐ శంకరయ్య కథనం మేరకు.. తంబిగానిపల్లికు చెందిన సింగారవేలు, కంగుంది గ్రామానికి చెందిన దుర్గా (27)తో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. కొంత కా లంగా దుర్గ కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సోమవారం దుర్గ ఇంట్లో పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మె ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నా యని దుర్గ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం సీఐ శంకరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య హత్య కేసులో భర్త అరెస్టు

భార్య హత్య కేసులో భర్త అరెస్టు