ప్రయాస్‌.. పరిశోధనలకు చాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రయాస్‌.. పరిశోధనలకు చాన్స్‌

Aug 18 2025 6:29 AM | Updated on Aug 18 2025 6:29 AM

ప్రయాస్‌.. పరిశోధనలకు చాన్స్‌

ప్రయాస్‌.. పరిశోధనలకు చాన్స్‌

విద్యార్థుల నుంచి పరిశోధన ప్రాజెక్టులకు ఆహ్వానం 9 నుంచి 11వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులు శాసీ్త్రయత, దృక్ఫథాన్ని పెంపే లక్ష్యం ఎంపికై తే రూ.50 వేలు మంజూరు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థుల దృష్టి మరల్చేందుకు, శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి కేంద్రం ప్రయాస్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఆసక్తి గల విద్యార్థుల నుంచి ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. ఈ పథకాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న 9 నుంచి 11 వ తరగతి వరకు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు ప్రతిపాదనలను దరఖాస్తు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) సంస్థ ప్రమోషన్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ యాటిట్యూడ్‌ అమాంగ్‌ యంగ్‌ అండ్‌ యాస్పైరింగ్‌ స్టూడెంట్స్‌ (ప్రయాస్‌) పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. అందులో పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాలకు సంబంధించి పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు 6,426 ఉన్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 9 వ తరగతి నుంచి 11 వ తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రయాస్‌ పథకం అర్హులు. జిల్లాలో 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఈ విద్యాసంవత్సరంలో 42 వేల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక పాఠశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు ప్రాజెక్టు ప్రతిపాదనలను పంపవచ్చు. అయితే ఒక పాఠశాల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆన్‌లైన్‌ విధానంలో ఈ నెల 30వ తేదీలోపు ప్రతిపాదనల దరఖాస్తులను పంపేందుకు అవకాశం కల్పించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇలా దరఖాస్తులు చేసుకునే విద్యార్థుల ప్రతిపాదనలను సెప్టెంబర్‌ 15 లోగా పరిశీలన చేసి అక్టోబర్‌ 15వ తేదీన విజేతలను కేంద్రం ప్రకటించనుంది.

జిల్లాలోని స్కూళ్లు, కళాశాలల సమాచారం

కేటగిరీ స్కూళ్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య

ప్రాథమిక 4,247 59,067

ప్రాథమికోన్నత 738 42,380

ఉన్నత 1,203 3,037

జూనియర్‌కాలేజీలు 238 27,700

మొత్తం 6,426 1,59,454

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేసేందుకు ఆఖరి తేదీ ఆగస్టు 30

దరఖాస్తుల స్క్రీనింగ్‌ సెప్టెంబర్‌ 15

జ్యూరీ ఎంపిక గడువు సెప్టెంబర్‌ 30

ఫలితల ప్రకటన అక్టోబర్‌ 15

ఎంపికయ్యే ప్రాజెక్టుల ప్రారంభం అక్టోబర్‌ 16

ప్రాజెక్టు ముగింపు తేదీ అక్టోబర్‌ 16–2026

రిపోర్ట్‌ సబ్మిషన్‌ తేదీ అక్టోబర్‌ 20–2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement