
డీఫార్మసీతో ఉజ్వల భవిష్యత్తు
–రేపు దరఖాస్తులకు చివరి గడువు
తిరుపతి సిటీ: ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి డీఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులకు మంగళవారంతో గడువు ముగయనుందని ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు. డీఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వంద శాతం ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. కోర్సులో ప్రవేశం పొంది.. రేషన్ కార్డు, ఇన్‌కమ్ సర్టీఫికెట్ కలిగి ఉన్న పేద విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌లు అందుతాయని తెలిపారు. ఇంటర్ బైపీసీ, ఎంపీసీ చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 99088 57585, 9966761446, 99635 41557 నంబర్లలో సంప్రదించాలని కోరారు.