
ఆగని ఏనుగుల దాడులు
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
అమాంతం పెరిగిన ఎరువుల ధరలు
ఏడాదిలో మూడుసార్లు పెంచిన కంపెనీలు
బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంపు
పెరుగుతున్న ధరలతో రైతుల అవస్థలు
పక్క రాష్ట్రాలకు పరుగులు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
పులిచెర్ల మండలంలోని పాళెం పంచాయతీలో ఏనుగుల గుంపు మరోసారి దాడి చేసి పంటలను నాశనం చేశాయి.
ముగిసిన తిరుణాల
సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండలో తిరుణాల ఆదివారం అట్టహాసంగా ముగిసింది.
సోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి పాలకుల నిర్లక్ష్యంతో అన్నదాత గుండె బరువెక్కుతోంది. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న వారిపై ఎరువుల ధరల పెంపు అదనపు భారాన్ని మోపుతోంది. ప్రకృతికి ఎదురొడ్డి వ్యవసాయం చేస్తున్న జిల్లా రైతాంగానికి పాలకులు ఏమాత్రమూ సాయంగా నిలవలేకపోతున్నారు. వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు పెరిగి అల్లాడిపోతున్న రైతులను ఎరువు ధరలు మరింత భయపెడుతున్నాయి.
వ్యవసాయంలో ప్రధానమైన ఎరువుల ధరలు అమాంతంగా పెరిగాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి , ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రం కావడంతో ఎరువుల వాడకం మరింత పెరిగింది. గతంలో ఎరువుల ధరలను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడుసార్లు పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. రైతన్నలకు సాగు మరింత భారంగా మారుతోంది.
సాగు విస్తీర్ణం ఇలా..
జిల్లా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.80 లక్షల హెక్టార్లు కాగా సరైన సమయంలో వర్షాలు కురవక ఇప్పటి దాకా కేవలం 50 నుంచి 70 వేల హెక్టార్లల్లో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. అందులో వేరుశనగ 3194 హెక్టార్లు, వరి 2747, కంది 135.0, చెరకు 2284, రాగి 113.5, టమాట 4,000, వివిధ రకాల కూరగాయల పంటలు 30 వేల హెక్టార్లతో పాటు ఇంకా పలు రకాల పంటలు, పండ్ల తోటలు సాగులో ఉన్నాయి.
అవసరానికి సరిపడా లేక
జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువులు అవసరానికి సరిపడా లభించలేదు. ఒకవేళ దొరికినా అధిక ధరలతో పాటు వేరే ఎరువులు కూడా కొనాలనే ఒత్తిడి జిల్లా రైతాంగం ఎదుర్కొంటోంది. అవసరానికి సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఒకసారి, కేంద్రం... రాష్ట్రానికి నెల వారీగా ఇవ్వాల్సిన కోటా ఎరువులు పంపడం లేదని ఇంకోసారి.. ఇలా కూటమి సర్కారు పొంతన లేని ప్రకటనలు చేయడం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. వాస్తవానికి కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ఎరువులను తెప్పించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని టీడీపీ నేతలే కొందరు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
పక్కరాష్టాలకు పరుగు
జిల్లాలో లభ్యమవుతున్న ఎరువుల ధరలు, నాణ్యత లోపం, సరఫరా తదితర విషయాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తద్వారా రైతులు ఎరువుల కోసం పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. పలమనేరు, కుప్పం, వీ.కోట, రామకుప్పం, శాంతిపురం, పంగనూరు తదితర ప్రాంతాల్లోని రైతులు ఎరువుల కోసం కర్ణాటకను ఆశ్రయిస్తున్నారు. బంగారుపాళ్యం, యాదమరి, చిత్తూరు, కార్వేటినగరం, నగరి, ఎస్‌ఆర్‌పురం, జీడీ నెల్లూరు, పాలసముద్రం తదితర మండలాల్లోని రైతులు తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పరదరామి, పొన్నై, సోలింగరం తదితర ప్రాంతాలకు వెళుతున్నారు.
ఎరువుల నిల్వ (ఫైల్)
పెంచిన ధరలు
ఏటా ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌లో పంటల సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ పాస్పేట్ వంటి ఎరువుల వాడకం పెరుగుతోంది. మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వినియోగంతో పెట్టుబడి పెరిగింది. ఫలితంగా దిగుబడి ఎంత వచ్చినా రైతుకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 50 కిలోల ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచింది. జిల్లాలో ఒక్కో మండలంలో సరాసరిన రసాయనిక ఎరువులు ఏడాదికి 3,500 టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుం చి గరిష్టంగా రూ.4 వేల వరకూ ఎరువుల ధరలు పెరగడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద అప్పు పెడుతున్నారు. పంట వచ్చాక వడ్డీతో సహా తీర్చాల్సి ఉండటంతో వచ్చిన ఆదాయం ఎరువుల అప్పులకే సరిపోతోంది.
ధరలు తగ్గించాలి
ఏ పంట పండించాలన్నా పెట్టుబడి వేధిస్తోంది. బ్యాంకులకు రుణం కోసం వెళ్తే ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చినా తిరిగీ కట్టే పరిస్థితులు ఉండడం లేదు. పంట దిగుబడి వచ్చినా ధరలు లేక నష్టాలు చవిచూస్తున్నాం. ఇందుకు నిదర్శనమే మామిడి విపత్తు. ఇప్పుడు అప్పొ..సప్పొ చేసి వరి పండించా. ముఖ్యంగా ఎరువులు దొరకడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి. ఇలాగైతే పంట పండించడం మానుకోవాల్సిందే. ఎరువుల ధరలు తగ్గించాలి. – ప్రభాకర్‌రెడ్డి, ఐరాల మండలం
ఎరువుల కోసం తమిళనాడుకు
నేను 2 ఎకరాలో అరటి, ఎకరాలో వరి వేశా. ఈ వర్షానికి వరి మొత్తం నేల మట్టమైంది. ఏ పంట పండించినా చేతికి చిల్లిగవ్వ మిగలడం లేదు. కష్టాల్లోనే మిగిలిపోతున్నాం. కర్షకుల కష్టాలు తెలియకుండా ఎరువుల రేట్లను పెంచుకుంటూ పోతే ఎలా. ఇది మంచిది కాదు. రైతులను బతికించాలి. ఎరువుల ధరలను తగ్గించాలి. ఈ దెబ్బతో చాలా మంది రైతులు ఎరువుల కోసం తమిళనాడుకు వెళుతున్నారు. నేను కూడా అక్కడికి వెళ్లాల్సిందే.
– కన్నయ్యనాయుడు, జంగాలపల్లి, చిత్తూరు మండలం
రాయితీ ఎరువుల ధరలను సంబంధిత కంపెనీలు అనూహ్యంగా పెంచాయి. బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచి రైతులపై భారాన్ని మోపాయి. ఏటా పెరుగుతున్న ధరల కారణంగా అన్నదాతలకు పంటల సాగు శక్తికి మించిన పనిగా మారుతోంది. పెరుగుతున్న ధరలు రైతన్నలను నడ్డి విరుస్తున్నాయి. నానో యూరియా ద్రవ రూపంలో కేంద్రం తీసుకొచ్చింది. కానీ దానిపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఏటా సాగు ఖర్చులు రెట్టింపై వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇప్పటికై న పాలకులు కళ్లు తెరిచి రైతులపై భారం మోపకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎరువుల ధరలు ఇలా..(50 కిలోల బస్తా)
ఎరువురకం పాతధర కొత్త ధర
(రూ.లల్లో) (రూ.లల్లో)
పొటాష్ 1,535 1,800
20–20–013(ఫ్యాక్ట్) 1300 1425
20–20–013(గ్రోమోర్) 1,300 1,350
20–20–013(పీపీఎల్) 1,300 1,400
10–26–26 1,470 1,800
12–32–16 1,470 1,720
16–16–16 1,450 1,600
15–15–15–0–9 1,450 1,600
16–20–0–13 1,250 1,300
24–24–0 1700 1800
14–35–14 1700 1,800
సింగల్ సూపర్ ఫాస్పేట్ 580 640
వైఎస్సార్‌సీపీ హయాంలో మేలు
2014–19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా తోచినప్పుడల్లా ఎరువుల ధరలు పెంచారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రసాయనిక ఎరువుల ధరలు ఒక్కసారి కూడా ధరలు పెరగలేదు. రైతులకు కావాల్సినంత మేర ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందించేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రైతుల నడ్డి విరిచేలా ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. ఇక రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీకి మంగళం పాడుతోంది. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

ఆగని ఏనుగుల దాడులు

ఆగని ఏనుగుల దాడులు