
నాల్గోసారీ!
తమకు గౌరవం ఎలాగో ఇవ్వడం లేదు.. కనీస వేతనం అయినా ఇవ్వాలని జెడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు.
అధికార కార్యక్రమాలకు పిలవని సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీశులు ఇవ్వాలని జెడ్పీటీసీ సుమన్ కోరారు. – – శ్రీకాళహస్తి–కేకే రోడ్డు బాగాలేదని, పీలేరు–భాకరపేట దారి సరిలేదని జెడ్పీటీసీలు సుబ్బారెడ్డి, శేఖర్‌రెడ్డి ఆరోపించారు.
గత ప్రభుత్వంలో పీఎల్‌ఆర్ సంస్థకు మంజూరైన రోడ్లను ఎందుకు సగంలో ఆపివేశారని మదనపల్లె జెడ్పీటీసీ ఉదయ్ ప్రశ్నించారు.
ఆర్.నడిమిపల్లెలో దానం ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ స్కూల్ ఎత్తివేశారని ఆ స్థలం తిరిగి ఇవ్వాలని రామసముద్రం జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి అడిగారు.
పలు పాఠశాలల ప్రహరీగోడలు కూలిపోయాయని విద్యార్థినులు టాయ్‌లెట్స్‌కు వెళ్లాలంటే ఎలా అని పెద్దమండ్యం జెడ్పీటీసీ పీరమ్మ ప్రశ్నించారు.
చిత్తూరు చర్చి వీధిలోని దేవదాయశాఖ ఏసీ కార్యాలయాన్ని ఎందుకు 3 కిలోమీటర్లు దూరంలో ఉన్న సంతపేటకు మార్చారని కుప్పం జెడ్పీటీసీ శరవణ నిలదీశారు.
మండలంలోని పాఠశాలలకు ప్రహరీగోడలు నిర్మించాలని గుడుపల్లె జెడ్పీటీసీ కృష్ణమూర్తి సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ పాల్గొన్నారు.
తూతూమంత్రంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
రెండున్నర గంటల్లోనే ముగించేశారు
కనిపించని పలువురు ఎమ్మెల్యేలు
చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ 4వ సర్వసభ్య సమావేశం తూతూమంత్రంగా సాగింది. శనివారం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన, సీఈఓ రవికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జేసీ విద్యాదరి హాజరయ్యారు. ఇక సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆదిమూలం, మురళీమోహన్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మినహా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కాలేదు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభించగా మధ్యాహ్నం 1.30కు ముగించేశారు. అజెండాలో 11 అంశాలపై చర్చ జరపాల్సి ఉండగా.. అందులో రోడ్లు, వ్యవసాయం, విద్య, ఆర్యోగ శాఖలపై చర్చించి మిగిలిన వాటిని తూతూమంత్రంగా కానిచ్చేశారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి పలు శాఖల అధికారులు హాజరు కాలేదు. సభ్యుడు కానీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజన్ సమావేశానికి హాజరవ్వడం గమనార్హం.
50 ఏళ్లుగా ఇలాంటి పాలన చూడలేదు
ప్రజాప్రతినిధులంటే దిష్టిబొమ్మల్లా అధికారులకు కనపడుతున్నట్టు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి పిచ్చి తుగ్లక్ పాలన చూడలేదని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో తన చేతులమీదుగా ఇచ్చిన చెక్‌ను మరోసారి కార్యక్రమం పెట్టి ఇంకొకరి చేతుల మీదుగా వ్యవసాయశాఖాధికారులు ఇప్పించారన్నారు. పలు కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. ప్రొటోకాల్ పాటించని అధికారుల పై స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. గత పాలనలో రోడ్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో బాగా జరిగాయన్నారు. ప్రస్తుతం 36 రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాపోయారు. ఆర్‌అండ్‌బీ బైపాస్ రోడ్డు మంజూరైనా పనులు చేయలేదని, సీకేపొడి, నాగలాపురం– శ్రీసిటీ, నాగలాపురం–టీపీకోట రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. చాలా రోడ్లపై కనీసం ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. కేవీపురం మండలం, ఎగవ పూడిబ్రిడ్జి, నారాయణవనంలోని తంబూరు, పాలమంగళం బ్రిడ్జిలు దెబ్బతిన్నాయన్నారు. నాగలాపురం–సురటపల్లెకు వెళ్లే మార్గంలో మూడు కిలోమీటర్లు రోడ్డు వేయాల్సి ఉందన్నారు. జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో కనీసం ఫర్నిచర్ కూడా లేదన్నారు.
108 వాహనాలు లేవు
పలు ప్రభుత్వాస్పత్రుల్లో 102, 104, 108 వాహనాలు అందుబాటులో లేవని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర కేసులను దూరంగా ఉండే ప్రభుత్వాస్పత్రులకు కాకుండా సమీపంలో ఉండే నెట్‌వర్క్ ఆస్పత్రులకు పంపాలన్నారు. తల్లీబిడ్ల ఎక్స్‌ప్రెస్ వాహనాల సంఖ్యను పెంచాలని చెప్పారు. గ్రామాల్లో వేసిన బోర్లకు విద్యుత్ సర్వీసులు ఇవ్వడం లేదని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆరోపించారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు,
జేసీ విద్యాదరి పక్కన సీఈఓ రవికుమార్‌నాయుడు
సమస్యలు ఏకరువు

నాల్గోసారీ!