
ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
పుంగనూరు: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలోని శ్రీప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనారిటీ సెల్ కన్వీనర్ ఫకృద్దీన్‌షరీఫ్‌తో కలసి ఆయన కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసగిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేసి, తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర, వైఎస్సార్‌సీపీ నా యకులు జయరామిరెడ్డి, కిజర్‌ఖాన్, రాజేష్, ఖాదర్ బాషా, ఖాదర్, మమ్ము, రేష్మా, అంజాద్, తులసమ్మ, సాజిదా, శ్రీనివాసులు, నజీర్, భారతి, ఇంతియాజ్, రాఘవేంద్ర, అస్లాంమురాధి పాల్గొన్నారు.