
శాసీ్త్రయ సమాజ నిర్మాణమే జేవీవీ లక్ష్యం
పలమనేరు: శాసీ్త్రయ సమాజ నిర్మాణమే జనవిజ్ఙాన వేదిక లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డా.గేయానంద్ పేర్కొన్నారు. పల మనేరులోని ఓ ప్రైవేటు స్కూల్‌లో జేవీవీ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలు, సూడోసైన్స్, అశాసీ్త్రయ భావజాలం విపరీతంగా ప్రచారమవుతోందన్నారు. వీటిని అరికట్టి శాసీ్త్రయ సమాజాన్ని నిర్మించాలంటే యువత నడుం బిగించాలన్నారు. మరో అతిఽథి పలమనేరు బాలాజీ మాట్లాడుతూ నేటి సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక నేతలతో కలసి వారు సెప్టంబర్ 13న విజయనగరంలో జరగనున్న జేవీవీ వార్షిక సమావేశపు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.
జేవీవీ జిల్లా నూతన కార్యవర్గం
జేవీవీ జిల్లా అధ్యక్షుడిగా అరుణశివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా మిఠాయి యుగంధర్‌బాబు, కోశాధికారి గా గిరిధర్ మూర్తితోపాటు కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ నాయకులు మునిరత్నం, బాలచైతన్య, సుధాకర్, విజయకుమార్, ఆనందబెన్, సెల్వం, శ్యామల, రామలింగం పాల్గొన్నారు.