
బాధితులకు పరామర్శ
గంగాధరనెల్లూరు: కారులో గత మంగళవారం తిరుత్తణికి వెళ్తూ ప్రమాదానికి గురై గాయపడి, రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి పరామర్శించారు. శనివారం తమిళనాడులోని రాణిపేట సీఎంసీకి తమిళనాడు రాష్ట్రం, షోలింగర్ మాజీ ఎమ్మెల్యే పార్దిబన్‌తో కలిసి చేరుకున్నారు. సీఎంసీ డైరెక్టర్ దీపక్ సెల్వంతో భేటీ అయ్యారు. ప్రమాద బాధితులకు ప్రత్యేక వైద్య సేవలందించాలని కోరారు. చిట్టెమ్మ, రేఖ, కీర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీకరరెడ్డి, రూపకుమార్‌రెడ్డి, సురేంద్రరెడ్డి ఉన్నారు.