
జేసీబీ తరలిస్తుండగా విద్యుదాఘాతం
ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగలు, జేసీబీని తరలిస్తున్న టెంపో
– డ్రైవర్ మృత్యువాత
చౌడేపల్లె : టెంపోలో జేసీబీని తరలిస్తుండగా విద్యుదాఘాతంతో జేసీబీ డ్రైవర్ సుబ్రమణ్యంరెడ్డి(45) మృతి చెందిన ఘటన శుక్రవారం కొలింపల్లె వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. పుంగనూరు మండలం ఎల్లారుబైలు నుంచి జేసీబీని టెంపోలో కొలింపల్లె మీదుగా పుంగనూరు వైపునకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామసముద్రం మండలం టి.గొల్లపల్లెకు చెందిన సుబ్రమణ్యంరెడ్డి టెంపోలో జేసీబీని ఎక్కించి ఆ సీటులోనే అక్కడే కూర్చొని ప్రయాణిస్తుండగా కొలింపల్లె సమీపంలోని ఒడ్డోనితోట సమీపంలోకి రాగానే టెంపోలో గల జేసీబీకి విద్యుత్ తీగలు తగులుతాయని టెంపో డ్రైవర్ సుబ్రమణ్యం రెడ్డిని కట్టె సాయంతో పైకి ఎత్తాలని సూచించారు. జేసీబీలో నుంచి దిగేందుకు డోర్ తీయగా విధ్యుదాఘాతానికి గురై సుబ్రమణ్యంరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో టి.గొల్లపల్లెలో విషాధఛాయలు అలుముకొన్నాయి. ఎస్‌ఐ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం గల తీరుపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

జేసీబీ తరలిస్తుండగా విద్యుదాఘాతం

జేసీబీ తరలిస్తుండగా విద్యుదాఘాతం