
మత్తుతో భవిష్యత్తు అంధకారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో బుధవారం నషా ముక్త్ భారత్ అభియా న్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా విభిన్న ప్ర తిభావంతుల శాఖ ఏడీ వినోద్ తెలిపారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాదక ద్ర వ్యాలకు వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్య క్రమంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు. జిల్లాలోని కుప్పం ద్రవిడ యూనివర్శిటీ, చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను అవగాహన కల్పించినట్లు తెలిపారు.
పాలక మండలిలో
14 మందికి చోటు
చౌడేపల్లె : బోయకొండ దేవస్థానం పాలక మండలిలో ఎక్స్ అఫిషియో మెంబరుతో కలిపి మొత్తం 14 మందికి చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం బుధవారం తెలిపారు. పాలక మండలి ఏర్పాటులో ఆరుగురు మహిళలై ఉండాలన్నారు. ఆరుగురు ఓసీలలో ఒకరు బ్రాహ్మణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలలో ఇద్దరు , బీసీలలో 5 గురు సభ్యులై ఉండి, వారిలో ఒకరు నాయీబ్రాహ్మణులై ఉండాలని తెలిపారు. దరఖాస్తుదారులు 30 ఏళ్లకు పైబడి హిందువులై ఉండాలన్నారు. నిర్ణీత గడువులోపు దేవాదాయశాఖ ఉప కమిషనర్ విడుదల చేసిన ఫార్మెట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఈఓ సూచించారు.
పోలీసు కస్టడీకి బ్యాంకు మేనేజర్
చిత్తూరు అర్బన్ : ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల గోల్‌మాల్ కేసులో యూనియన్ బ్యాంకు మేనేజరు మురళి అప్రైజర్ భాస్కర ఆచార్యను మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ చిత్తూరులోని మొదటి అదనపు మెజిస్ట్రేట్ మాధవి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. యాదమరిలోని యూనియన్ బ్యాంకులో ఖాతాదారులు బంగారు ఆభరణాలను తాకట్టుపెట్టి రుణాలు తీసుకునే వారు. అయితే ఇటీవల బ్యాంకు ఆడిట్ నిర్వహించగా అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు స్థానంలో నకిలీ ఆభరణాలు తేలాయి. దీంతో ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు మేనేజర్ మురళి అప్రైజర్ భాస్కర్‌ను ఇటీవల అరెస్టు చేశారు. వీరిని కస్టడీకి ఇస్తే కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో చిరుజల్లులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వ్యాప్తంగా బుధవారం చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచే మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి రాత్రి వరకు నిలకడలేకుండా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ కురుస్తున్న వర్షాలకు వాతావరణం పూర్తిగా చల్లబడింది. చలి తీవ్రత పెరిగింది. వీటి కారణంగా విష జ్వరాలు పెరిగే అవకాశాలున్నాయని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.