
బస్సు, టెంపో ఢీ
– డ్రైవర్ దుర్మరణం
కుప్పం రూరల్ : ఎదురుగా వస్తున్న బస్సు – టెంపో ఢీకొని టెంపో డ్రైవర్ మృతి చెందిన సంఘటన కుప్పం మండలం, నడుమూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. కుప్పం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. కుప్పం వైపు నుంచి కోళ్లను వేసుకుని వెళ్తున్న లారీ, తమిళనాడు నుంచి అటుగా వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి కుప్పం మండలం, నడుమూరు అటవీ ప్రాంతం వద్దకు రాగానే సరిహద్దు సమీపంలో ఢీకొన్నాయి. ప్రమాదంలో టెంపో డ్రైవర్ తమిళనాడుకు చెందిన మునిరాజు (35) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తమిళనాడు బస్సులోని డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతి చెందిన టెంపో డ్రైవర్‌ను పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కాగా టెంపో డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

బస్సు, టెంపో ఢీ