నీటి సమస్య పరిష్కరించండి
పలమనేరు: వేసవి కారణంగా జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి సమస్య అధికంగా ఉందని, సమస్య పరిష్కారానికి సంబంధిత ఎంపీడీఓలు వెంటనే చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సూచించారు. పలమనేరులోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఆయన నీటి సమస్యపై అధికారులతో సమీక్షించారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపీడీఓలుగా బాధ్యతలు చేపట్టనున్న వారికి పోస్టింగ్ ఉత్తర్వులపై సంతకాలను చేశారు.
హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల పరిశీలన
పలమనేరు నియోజకర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె మండలాల్లో సాగుతున్న హంద్రీ–నీవా కుప్పం ఉప కాలువ సిమెంట్ లైనింగ్ పనులను జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు సోమవారం పరిశీలించారు. కాంట్రాక్టర్ ఈ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, లేదా? అని చూశారు. కాలువ పనులను పూర్తి చేసి సీఎం చంద్రబాబు ఈ కాలువలోకి నీటిని వదలి ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు పనులు చేసి ఆపై నీరు వదలకుంటే ఇక్కడి ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్నారు.


