తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి వరదరాజనగర్ లోని విశ్వం టాలెంట్ స్కూల్లో బుధవారం ఉదయం 10 గంటలకు విద్యార్థులకు ఏపీఆర్‌జేపీ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉచితంగా నిర్వహించనున్నట్టు విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలియజేశారు. ఏప్రిల్ 25న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు, ఈ ఉచిత నమూనా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 86888 88802 / 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.