యూట్యూబ్‌ ఐవోఎస్‌లో సరికొత్త సేవలు

YouTube Providing Picture In Picture Mode For iOS Application - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాలను వీడియోలతో యూట్యూబ్‌ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఐవోఎస్‌ అప్లికేషన్‌లలో యూట్యూబ్‌ సరికొత్త సేవలను ప్రారంభించింది. ఐవోఎస్‌ అప్లికేషన్‌లో పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌ మోడ్‌ను (పీఐపీ) ప్రవేశపెట్టింది. తాజాగా ఎమ్‌ఏసీ నివేదిక ప్రకారం ఐపాడ్‌ వినియోగదారులకు సరికొత్త ఐవోఎస్‌ అప్లికేషన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరోవైపు యాపిల్‌ ఐఫోన్‌ ఇదివరకే ఐవోఎస్‌ అప్‌డేట్‌ సేవలు కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐవోఎస్‌ అప్లికేషన్‌లో యూట్యూబ్‌ కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది.

కానీ ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొన్ని  వీడియోలతో అతి కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంది. అయితే వీడియోలను వినియోగదారులు ఐవోఎస్‌ హోమ్‌ స్క్రీన్ ద్వారా వీక్షించవచ్చు. కాగా  యూట్యూబ్ ప్రీమియమ్‌కు సభ్యత్వాన్ని పొందిన వినియోగదారులకే వీడియోలను ప్లేబ్యాక్ చేయడానికి యూట్యూబ్ అనుమతిస్తుంది. అదే విధంగా యూట్యూబ్‌ ప్రీమియమ్‌ చెల్లించనవారికే పీఐపీ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే పీఐపీ మోడ్‌ కావాలనుకునే భారతీయ వినియోగదారులు నెలకు రూ.129 తెలపగా, మొత్తం ఫ్యామిలీ వినియోగదారులైతే(5గురు) 189 రూపాయలు చెల్లించాలని యూట్యూబ్‌ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top