You Can Opt for Wedding EMIs With Marry Now Pay Later Options - Sakshi
Sakshi News home page

లడ్డూ కావాలా నాయనా! పెళ్లికీ ఈఎంఐ ఆఫర్‌: మ్యారీ నౌ పే లేటర్!

Published Tue, Mar 14 2023 1:40 PM

you can opt wedding EMIs with marry now pay later options check details here - Sakshi

సాక్షి,ముంబై:  ‘బై నౌ..పే లేటర్‌’ అనే ఆఫర్‌ స్మార్ట్‌ఫోన్లు లేదా కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోళ్లపైనా, అలాగే రియల్‌ ఎస్టేట్‌ కొనుగోళ్లలోను లభిస్తోంది.  ఇకపై ఇలాంటి బంపర్‌ ఆఫర్‌ పెళ్లిళ్లకు కూడా లభించనుంది.  తాజాగా మేరీ నౌ పే లేటర్‌ (ఎంఎన్‌పీఎల్‌) ఆప్షన్‌తో  పెళ్లిక ఈఎంఐ ఆఫర్‌  సెన్సేషన్‌గా మారింది.

లావిష్‌గా, జబరదస్త్‌గా పెళ్లి చేసుకోవానుకునేవారికి తీపికబురు ఇది. ట్రావెల్ ఫిన్‌టెక్ సంస్థ సంకాష్‌, రాడిసన్ హోటల్స్ భాగస్వామ్యంతో మ్యారీ నౌ పే లేటర్‌ను ప్రారంభించింది. దేశంలో పెరుగుతున్న వివాహ మార్కెట్‌ ట్రెండ్‌ను అందిపుచ్చు కునేందుకు ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంఎన్‌పీఎల్‌ పథకం రాడిసన్ హోటల్‌లలో  లభిస్తోంది. అంటే పెళ్లి  ఖర్చుల కోసం ఇక్కడ రుణాలు అందుబాటులో ఉంటాయి. 

ప్రస్తుతానికి ఈ ఆఫర్‌ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అందుబాటులో ఉంది. ఉత్తరప్రదేశ్‌, ఆగ్రాలోని ప్రముఖ ప్రదేశాల తోపాటు, జైపూర్, చండీగఢ్, పూణేలోని హోటళ్లలో త్వరలోనే ప్రారంభిస్తున్నారు. అలాగే దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నామని సంకాష్ సహ వ్యవస్థాపకుడు సీఈవోఆకాష్ దహియా తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి తమ రాడిసన్ హోటళ్లలో ఈ ఆఫర్ అందుబాటులో రానుందని చెప్పారు.  ఈ స్కీం అందుబాటులో ఉన్న హోటళ్లలో సగటున రోజుకు 50కి పైగా  ఎంక్వయిరీలు వస్తున్నాయట.

గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు పేరుగాంచిన రాజస్థాన్, ఆగ్రా తదితర చోట్ల ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందించడంపై దృష్టి పెట్టామని ఉద్యోగ్ విహార్‌లోని రాడిసన్ గురుగ్రామ్ జనరల్ మేనేజర్ నమిత్ విజ్ అన్నారు.

 ఎంఎన్‌పీఎల్‌ ఎలా పని చేస్తుంది?
► గరిష్టంగా రూ. 25 లక్షలు  దాకా రుణం పొందవచ్చు.  ఆరు లేదా 12 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఎంచుకున్న కాల వ్యవధిలో ఆరు నెలలు వడ్డీ లేకుండా లేదా 12 నెలలకు 1 శాతం వడ్డీతో సంకాష్‌ NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) లకు EMI (సమానమైన నెలవారీ వాయిదా) చెల్లించాలి.
► కస్టమర్ల  ఐడీ,  డ్రస్‌ పప్రూఫ్‌, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు,  పేస్లిప్‌,  ITR (ఆదాయపు పన్ను రిటర్న్‌లతో కూడిన థర్డ్-పార్టీ డేటా ద్వారా  రుణం ఎంత ఇవ్వాలి అనేది అంచనా వేస్తారు. 

ఈ ఏడాది దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు
దేశీయంగా మ్యారేజ్‌  మార్కెట్‌ దాదాపు 4 ట్రిలియన్‌ డాలర్లని అంచనా.  ఈనేపథ్యంలో .ఈ పథకం కింద 24లో రూ. 100 కోట్లరుణాలివ్వాలని ప్లాన్‌ చేస్తోంది.   ఈ ఏడాది దాదాపు 35 లక్షల జంటలు పెళ్లి చేసుకోబోతున్నాయి. కనీసం 3 వేల జంటలను పట్టుకున్నా. తమకు రూ.500 కోట్ల మార్కెట్‌ను వస్తుందని కంపెనీ భావిస్తోంది. . తమ పెళ్లి కుటుంబాలకు ఆర్థికభారం కాకూడదని  భావిస్తున్న యువకులు/విద్యావంతులైన జంటలకు ఇది ఉపయోగపడుతుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు

Advertisement
 
Advertisement
 
Advertisement