జియో..షావోమీ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!

Xiaomi India Ties Up With Jio To Offer 5g Experience - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియోతో  5జీ ఫోన్లకు సంబంధించి షావోమీ ఇండియా ఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జియో కస్టమర్లకు అచ్చమైన 5జీ సేవల అనుభవాన్ని అందించనున్నట్టు షావోమీ తెలిపింది. రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ పరిధిలో షావోమీ ఫోన్లకు మెరుగైన కవరేజీ అందేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ఇవ్వనుంది.

అన్ని షావోమీ 5జీ ఫోన్లు రిలయన్స్‌ జియో ట్రూ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తాయని షావోమీ ఇండియా ప్రకటించింది. యూజర్లు తమ ఫోన్‌ నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌లో ప్రిఫర్డ్‌ నెట్‌వర్క్‌ టైప్‌ను 5జీకి మార్చుకోవాలని సూచించింది.   

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top