జనవరి 1న ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేసిన బిలియనీర్ జెఫ్ బెజోస్..! | World 2nd richest person Jeff Bezos rings in New Year with a disco party | Sakshi
Sakshi News home page

జనవరి 1న ఫ్రెండ్స్‌తో తెగ ఎంజాయ్ చేసిన బిలియనీర్ జెఫ్ బెజోస్..!

Jan 2 2022 7:54 PM | Updated on Jan 2 2022 7:55 PM

World 2nd richest person Jeff Bezos rings in New Year with a disco party - Sakshi

డిసెంబర్ 31 తర్వాత ఇంగ్లీష్ క్యాలెండర్ ఎండ్ అవడం.. జనవరి 1తో కొత్త సంవత్సరం రావడం ప్రతి సారీ కామనే.. కానీ ప్రతి ఏడాదీ ప్రతి ఒక్కరూ చేసుకునే పార్టీలు మాత్రం కామన్ కాదు. అందరి లాగానే తను కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నట్లు ప్రపంచ 2వ అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ వేడుకల్లో తనతో పాటు మాజీ టీవీ హోస్ట్ లారెన్ బ్లాక్ కూడా ఉన్నారు. 

తనతో పాటు అతని తమ్ముడు మార్క్, లారెన్ కుమారుడు నిక్కో, మాజీ ఎన్ఎఫ్ఎల్ స్టార్ టోనీ గొంజాలెజ్ కూడా ఉన్నారు. జెఫ్ తన కుటుంబంతో కలిసి 'క్రేజీ డిస్కో పార్టీని' ఆస్వాదించానని, కొత్త సంవత్సరం 'వ్యక్తిగత ఎదుగుదల'కు సమయం అని తన అనుచరులకు చెప్పాడు. ఇంస్టాగ్రామ్ పోస్ట్ కింద ఇలా రాశారు.. 'గత రాత్రి కుటు౦బ౦తో క్రేజీ డిస్కో పార్టీ జరుపుకు౦టున్న౦దుకు మేము ఎ౦తో ఆన౦ది౦చా౦. అలాగే, కొత్త స౦వత్సరం కూడా వ్యక్తిగత ఎదుగుదల, పునరుద్ధరణ, పునర్జన్మ, మీ జీవిత౦లో ప్రతి క్షణ౦ జాగ్రత్తగా శ్రద్ధ వహించడానికి ఇది గొప్ప సమయ౦. మంచి & చెడు అన్నీ జరుపుకోండి, ఎదగండి" అని పేర్కొన్నారు. 

(చదవండి: సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement