ఐఫోన్ కావాలంటే కొనుక్కోవాలికానీ కొరికితే ఎలా? వింత చోరీ వీడియో వైరల్‌! | Sakshi
Sakshi News home page

ఐఫోన్ కావాలంటే కొనుక్కోవాలికానీ కొరికితే ఎలా? వింత చోరీ వీడియో వైరల్‌!

Published Mon, Sep 4 2023 6:03 PM

Woman bites through security wire to steal iPhone 14 in China - Sakshi

iPhone theft: యాపిల్ ఐఫోన్ (Apple iPhone)15 త్వరలో లాంచ్‌ కాబోతోంది. యమా క్రేజ్‌ ఉండే ఐఫోన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఇది అప్‌డేట్లకు సంబంధించినది కాదు.. ఐఫోన్‌ చోరీకి సంబంధించినది.

ఖరీదైన ఐఫోన్ల చోరీల గురించి తరచూ వింటుంటాం. ఈమధ్య ఈ ఫోన్ల దొంగతనాలు సృజనాత్మకంగా మారాయి. అలాంటిదే చైనాలో ఒకటి తాజాగా జరిగింది. ఆ చోరీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఓ యాపిల్‌ స్టోర్‌లో సుమారు రూ. 80,000 విలువ చేసే ఐఫోన్‌ 14 ఫ్లస్‌ (iPhone 14 Plus)ని చాకచక్యంగా దొంగిలించింది ఓ మహిళ. స్టోర్‌లో డిస్‌ప్లేకు ఉంచిన ఫోన్‌ను యాంటీ-థెఫ్ట్ కేబుల్‌ను కొరికేసి తన బ్యాగులో వేసుకుంది. అలారం స్టోర్‌ సిబ్బంది గుర్తించలేకపోయారు. చోరీ జరిగిన అరగంట తర్వాత చూసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ మహిళను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement