2026 ఆగస్టు 25 నుంచి భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌ను నిషేధిస్తారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఇన్‌స్టా యూజర్లు ఆందోళనకు గురయ్యారు. కొందరు తమ ఫొటోలు, వీడియోలను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా సూచిస్తూ పోస్టులు చేశారు. అయితే.. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకారం.. సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ నిషేధానికి సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మవద్దని ప్రజలకు సూచించింది.
ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, కొత్త నిబంధనలు లేదా నిషేధాలపై సమాచారం వస్తే.. సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు. దీనిపై అధికారిక వర్గాల ద్వారా నిజానిజాలు తప్పకుండా తెలుసుకోవాలి. తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం వల్ల ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడుతుందని హెచ్చరించింది.
మొత్తం మీద.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోంది. వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్ అవుతుందనే వార్తలో ఎలాంటి నిజం లేదనే విషయం ప్రజలు గమనించాలి.
A post is being shared on social media claiming that #Instagram will be banned in India from the night of 25 August 2026 #PIBFactCheck:❌ The claim is false
✅ No such announcement has been made by the Government of India https://t.co/3sottwhjvJ— PIB India (@PIB_India) July 27, 2026


