సెబీకి వ్యతిరేకంగా వెళ్లము | Will cooperate fully with fresh forensic audit says Rajesh Exports | Sakshi
Sakshi News home page

సెబీకి వ్యతిరేకంగా వెళ్లము

Jun 11 2026 6:21 AM | Updated on Jun 11 2026 6:23 AM

Will cooperate fully with fresh forensic audit says Rajesh Exports

రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ స్పషీ్టకరణ 

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టనున్న ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు పూర్తిస్థాయిలో సహకరించనున్నట్లు బంగారు ఆభరణాలు, రిఫైనరీ కంపెనీ రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తాజాగా వెల్లడించింది. కంపెనీ 2020–21 నుంచి 2024–25 కాలంలో రూ. 15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని అక్రమంగా నమోదుచేసినట్లు సెబీ గుర్తించింది. దీంతో తాజాగా ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సెబీ ఆదేశించింది. 

వీటిని సవాలు చేయబోమని కంపెనీ స్పష్టం చేసింది. కాగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం ఆదాయ నమోదులో అక్రమాలకు తెరతీసినట్లు గుర్తించడంతో ఇటీవల కంపెనీ చైర్మన్‌ రాజేష్‌ మెహతాను సెక్యూరిటీల మార్కెట్‌ నుంచి సెబీ నిషేధించింది. అయితే ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదంటూ రాజేష్‌ మెహతా ప్రకటించడం గమనార్హం! సెబీ అడిగిన అన్ని డాక్యుమెంట్లనూ దాఖలు చేసినట్లు చెప్పారు. ఎక్కడో సమాచార లోపం ఏర్పడినట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement