వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై..!

WhatsApp Testing Waveforms for Voice Messages Removing Online Status For Business Accounts - Sakshi

వాట్సాప్‌ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడే సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌.  సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్‌ సొంతం. తరుచుగా తన వినియోగదారుల కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా మరో ఫీచర్‌ను మరికొద్ది రోజుల్లోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఫీచర్‌లో భాగంగా వాట్సాప్‌లో వినియోగదారులకు కనిపించే వాయిస్‌ మెసేజ్‌ సీక్‌ బార్‌ మారనున్నట్లు తెలుస్తోంది. సీక్‌బార్‌ స్థానంలో తరంగాల రూపంలో(వేవ్‌ ఫార్మ్‌స్‌) కనిపించనుంది.


వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌ వాడుతున్న వినియోగదారులకు కూడా శుభవార్తను అందించింది. భవిష్యత్తులో బిజినెస్‌ అకౌంట్‌ వాడుతున్న వారికి ఆన్‌లైన్‌లో ఉన్నట్లుగా ఉండే ఆప్షన్‌ ఇతర వాట్సాప్‌ వినియోగదారులకు కనిపించదని వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బిజినెస్‌ అకౌంట్‌ వాడుతున్నవారికి ఇతరులకు లాస్ట్‌సీన్‌ కూడా కనిపించదని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్లు టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. కాగా  ఈ ఫీచరును ఏప్పుడు రిలీజ్‌ చేస్తారనే విషయాన్ని వాట్సాప్ చెప్పలేదు.

చదవండి: వాట్సాప్‌ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా.!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top