వాట్సాప్‌ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా.!

how to send money transfer through whatsapp in india - Sakshi

అందరికి అందుబాటులోకి వాట్సాప్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌ 

160 బ్యాంకులతో వాట్సాప్‌ టై అప్‌ 

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై అందరు వాట్సాప్‌ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. వాట్సాప్‌ ఈ సదుపాయాన్ని గతేడాది అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామందికి ఆ ఫీచర్‌ అందుబాటులోకి రాకపోవడంతో పాటు పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఏడాది కాలంగా "వాట్సాప్‌ పే" ఫీచర్‌పై వర్క్‌ చేస్తుంది. తాజాగా ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందని, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు వాట్సాప్‌ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది. 

కాగా, ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్‌ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీపీఐ) సహకారంతో ఇండియాలోనే తొలిసారిగా 160 బ్యాంక్‌ల మద్దతుతో వాట్సాప్‌పే ఫీచర్‌ పనిచేస్తుంది.  

వాట్సాప్‌ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ ఎలా చేయాలంటే 

♦ ముందుగా వాట్సాప్‌ సెట్టింగ్‌ మెనూ ఆప్షన్‌ పై ట్యాప్‌ చేయాలి

♦ ట్యాప్‌ చేసిన వెంటనే మనకు యాడ్‌ న్యూ పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది

♦ ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే ... 160 బ్యాంక్‌ల లిస్ట్‌ చూపిస్తుంది

♦  ఆ లిస్ట్‌ లో మీకు కావాల్సిన బ్యాంక్‌ నేమ్‌ పై క్లిక్‌ చేసి మీ ఫోన్‌ నెంబర్‌ ను వెరిఫై చేయాలి

♦  వెరిఫై చేసే సమయంలో బ్యాంక్‌ కు లింక్‌ చేసిన ఫోన్‌ నెంబర్‌ కు మెసేజ్‌ వస్తుంది. 

 ♦ ఒక వేళ మీరు బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ యాడ్‌ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. 

  ♦ బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ యాడ్‌ చేసి మీరు డబ్బుల్ని మీ వాట్సాప్‌ అకౌంట్‌ ద్వారా ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చు  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top