షాపింగ్‌ బటన్‌ జోడించిన వాట్సాప్‌

WhatsApp Rolls Out New Button To  Make Shopping - Sakshi

హైదరాబాద్: మెసేజింగ్, వాయిస్‌ ఓవర్‌ ఐపీ సర్వీస్‌ అందిస్తున్న వాట్సాప్‌ తాజాగా బిజినెస్‌ అకౌంట్లకు షాపింగ్‌ బటన్‌ను జోడించింది. దీని ద్వారా కంపెనీలు, విక్రేతలు అందించే వస్తు, సేవల జాబితాను ఒకే క్లిక్‌తో చూసేందుకు కస్టమర్లకు వీలవుతుంది. కొంత కాలంగా ప్రయోగాత్మకంగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మంగళవారం నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 17.5 కోట్ల మంది యూజర్లు బిజినెస్‌ అకౌంట్లకు సందేశాలు పంపిస్తున్నారని వాట్సాప్‌ వెల్లడించింది.

ఇందులో ప్రతి నెల 4 కోట్ల మంది బిజినెస్‌ క్యాటలాగ్‌ను వీక్షిస్తున్నారట. వీరిలో భారత్‌ నుంచి 30 లక్షల మంది ఉన్నారు. జాబితాను చూడగలిగితే వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఇటీవల భారత్‌లో నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది వెల్లడించారని వాట్సాప్‌ తెలిపింది. ఇటువంటి కస్టమర్లు సులువుగా కొనుగోళ్లు జరిపేందుకు వీలుగా కొత్త షాపింగ్‌ బటన్‌ను జోడించినట్టు వివరించింది. అయితే కంపెనీలు, విక్రేతలు తమ వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్లకు క్యాటలాగ్‌ను జోడిస్తేనే సాధారణ కస్టమర్లు ఈ బటన్‌ను వీక్షించే వీలుంటుంది. (వాట్సాప్‌ సందేశాలు వారంలో మాయం!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top