సెక్యూరిటీకి ఢోకా లేని కొత్త ఫీచర్లు: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

WhatsApp new security feature here check details - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను తీసు కొచ్చింది.  ఎప్పటికపుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న సంస్థ తాజాగా   మూడు సెక్యూరిటీ ఫీచర్లను పరిచయం చేసింది. వాట్సాప్‌ను వాడుతున్నది  నిజంగా మీరేనా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు ఉపయోగపడతాయి.

 మూడు సెక్యూరిటీ ఫీచర్లు
అకౌంట్ ప్రొటెక్ట్ (Account Protect), డివైజ్‌ వెరిఫికేషన్ (Device Verification), ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ (Automatic Security Codes) అని పిలిచే ఈ మూడు ఫీచర్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రానున్నాయి.  తద్వారా యూజర్ల ప్రైవసీ,  భద్రత మరింత మెరుగు పడుతందని కంపెనీ వెల్లడించింది. (27వేల మంది తొలగింపు: అమెజాన్‌ సీఈవో కీలక వ్యాఖ్యలు)

అకౌంట్ ప్రొటెక్ట్
పాత స్మార్ట్‌ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు వాట్సాప్ అకౌంట్‌ను మార్చేటప్పుడు యూజర్లకు ఓల్డ్ అకౌంట్‌లో ఎలాంటి హెచ్చరికలు  కనిపించవు దీంతో  రియల్‌ యూజర్‌ స్థానంలో  మరొకరు ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే  కొత్త ప్రొటెక్ట్ ఫీచర్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం వెరిఫై చేస్తే గానీ కొత్త మొబైల్‌లో సంబంధిత నంబర్‌తో వాట్సాప్ అకౌంట్‌కి లాగిన్ చేయడం కుదరదు.  

ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్‌
వినియోగదారులు తాము మెసేజ్‌లు పంపుతున్న అవతల వ్యక్తికి సురక్షితమైన కనెక్షన్‌ ఉందో లేదో  నిర్ధారించుకునే అవకాశం ఈ ఫీచర్‌ ద్వారా దొరుకుతుంది.'ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్‌లు' కింద, కంపెనీ "కీ ట్రాన్స్‌పరెన్సీ" అనే ప్రక్రియపై ఆధారపడి వినియోగదారులు తమ సంభాషణ సురక్షితంగా ఉందని ఆటోమేటిక్‌గా వెరిఫై చేయడానికి ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్‌ తోడ్పడతాయి. ఎన్‌క్రిప్షన్ ట్యాబ్‌లో, చాట్‌ సురక్షితంగా  ఉన్నదీ, లేనిదీ వెరిఫై చేసుకోవచ్చు. (టాటా, బిర్లా సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే? అనంత్‌, రాధికా మర్చంట్‌ అడోరబుల్ ‌వీడియో వైరల్‌)

డివైజ్ వెరిఫికేషన్
ఇక మూడవది డివైజ్ వెరిఫికేషన్. యూజర్ల ప్రైవసీ,సెక్యూరిటీ ప్రమాదంలో పడకుండా రక్షించే అదనపు భద్రతా ఫీచర్‌ ఇది. యూజర్ల అకౌంట్‌ను అథెంటికేట్ చేయడానికి, డివైజ్‌లోకి మాల్వేర్‌ చొరబడితే అకౌంట్‌ను రక్షించడానికి అదనపు భద్రతా చర్యలను వాట్సాప్ పరిచయం చేసింది. తద్వారా యూజర్లతో సంబంధం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో తమంతటమాల్వేర్జాడలను చెక్ చేస్తుంది. ఇందుకోసం వాట్సాప్ తన వినియోగదారులు టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలని కూడా సూచించింది.  (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top