లింక్డిన్‌ సర్వే : 2024 డిమాండ్‌ ఎక్కువగా ఉన్న స్కిల్స్‌ ఇవే .. ‘AI’ కూడా ఏం చేయలేదు!

What Are The Most In Demand Skills For 2024 - Sakshi

ప్రపంచ దేశాల్లో కృత్తిమ మేధ (ఏఐ) ఉద్యోగులకు ఓ సవాల్‌ విసురుతోంది. ఇందులో ప్రావిణ్యం ఉంటేనే ఉద్యోగిగా రాణించాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా సంస్థలన్నీ ఇప్పుడు ఏఐలో నిపుణులైన ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నాయి. ఏఐతో పాటు పలు విభాగాల్లో నిష్ణాతులైన వారు మాత్రమే కోరుకున్న ఉద్యోగంలో, కోరుకున్న జీతంతో సెటిల్‌ అవుతున్నారు. లేదంటే పోటీ ప్రపంచంతో పోటీ పడలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కంపెనీలు ప్రకటిస్తున్న లేఆప్స్‌లో ముందు వరసలో ఉంటున్నారు. 

ఈ తరుణంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కి చెందిన ఎంప్లాయిమెంట్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ లింక్డిన్‌ కంటెంట్‌ స్ట్రాటజీ గ్లోబుల్‌ హెడ్‌ డాన్ బ్రాడ్నిట్జ్ ఉద్యోగార్ధుల కోసం కీలక అంశాలను లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. 

ఈ పనులు ఏఐ కూడా చేయలేదు
సంస్థలు ఏఐ నిపుణులను ఏరికోరి ఉద్యోగాలిస్తుంటే.. కృత్తిమ మేధ అవసరంలేని, కేవలం మనుషులు మాత్రమే చేసే కొన్ని ప్రత్యేక ఉద్యోగాలున్నాయి. ఆ ఉద్యోగాలకు ఆయా స్కిల్స్‌ ఉన్న వర్క్‌ ఫోర్స్‌ అవసరం. కానీ డిమాండ్‌కు తగ్గట్లు ఉద్యోగులు లేకపోవడంతో ఈ స్కిల్స్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు తెలిపారు.

ప్రతి 10 మంది సీఈఓల్లో 9 మంది 
అంతేకాదు సంబంధిత స్కిల్స్‌లో ఇప్పటికే నిష్ణాతులైన నిపుణులతో ఓ సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఆధారంగా ఉద్యోగిలో స్కిల్స్‌ ఉంటే మాత్రం ఉద్యోగానికి తిరుగుడుందని డాన్ బ్రాడ్నిట్జ్ వెల్లడించారు. బ్రాడ్నిట్జ్‌ పేర్కొన్న స్కిల్స్‌ వ్యక్తిగత కెరీర్‌ వృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాల జాబితాలో తొలిస్థానంలో ఉన్నాయని లింక్డిన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనీష్‌ రామన్‌ అంచనా వేస్తున్నారు. ఇక లింక్డిన్‌ సర్వే ఆధారంగా ప్రతి 10 మంది సీఈఓల్లో 9 మంది సీఈఓలు తప్పని సరిగా ప్రతి ఉద్యోగిలో ఈ నైపుణ్యాలు ఉండాలని చెప్పారు. 

భవిష్యత్‌కు భరోసా
వాటిల్లో కమ్యూనికేషన్‌, కస్టమర్‌ సర్వీస్‌, లీడర్‌షిప్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్మెంట్‌, మేనేజ్మెంట్‌, అనలిటిక్స్‌, టీమ్‌ వర్క్‌, సేల్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, రీసెర్చ్‌ ఈ నైపుణ్యాలు ఉంటే సంస్థల్లో ఉద్యోగులకు ఢోకా ఉండదని, ఈ ఏడాదిలో అత్యధికంగా డిమాండ్‌ ఉన్న స్కిల్స్‌గా ప్రసిద్ధి చెందాయని లింక్డిన్‌ కంటెంట్‌ స్ట్రాటజీ గ్లోబుల్‌ హెడ్‌ డాన్ బ్రాడ్నిట్జ్ చెబుతున్నారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top