రోజంతా లాభనష్టాల ఊగిసలాట: చివరికి నష్టాలే

Volatality Sensex trades flat, Nifty breaks16600 - Sakshi

55500 దిగువకు  సెన్సెక్స్‌

16600 స్థాయి దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ద్రవ్యోల్బణం, ‍క్రూడ్‌ ధరలు, తదితర అంతర్జాతీయ పరిణమాల నేపథ్యంలో రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి నష్టాలనే మూటగట్టుకున్నాయి.తద్వారా మూడు రోజుల లాభాలను బ్రేక్‌ ఇచ్చాయి. సెన్సెక్స్‌  185 పాయింట్ల నష్టంతో 55581 వద్ద,నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 16522 వద్ద ముగిసాయి. చివరి అర్థ గంటలో బ్యాంకింగ్‌,  మెటల్‌ షేర్లు పుంజుకోవడంతో నష్టాల తీవ్ర తగ్గింది.  

జేఎస్‌ డబ్ల్యూ  స్టీల్‌, కోల్‌ ఇండియా,హెచ్‌డీఎఫ్‌సీ  లైఫ్‌, ఎం అండ్‌ ఎం కోటక్‌ మహీంద్ర బ్యాంకు లాభపడగా, బజాజ్‌ ఆటో, అపోలో, టెక్‌  ఎం, హిందాల్కో, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో  రుపీ 77.53 వద్ద ముగిసింది. 

మరోవైపు ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా డెల్టాకార్ప్‌ కంపెనీలో 25 లక్షల ఈక్విటీ షేర్లను (మొత్తం షేర్ హోల్డింగ్‌లో 0.93 శాతం)విక్రయించారు. దీంతో జున్‌జున్‌వాలా షేర్‌ హోల్డింగ్‌  7.1 శాతం నుంచి 6.16 శాతానికి  పడిపోయింది. దీంతో కంపెనీ షేర 2.28 శాతం నష్టపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top