Vivo: మొబైల్స్ ఎగుమతికి కొత్త వ్యూహాలు.. ఈ ఏడాది టార్గెట్ ఇదే!

Vivo new manufacturing unit 10 lakh mobiles export 2023 details - Sakshi

ఈ ఏడాది వివో లక్ష్యం

న్యూఢిల్లీ: మొబైల్స్‌ తయారీలో ఉన్న వివో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి 2023 చివరినాటికి మరో రూ. 1,100 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. గ్రేటర్‌ నోయిడాలో నూతనంగా రాబోతున్న యూనిట్‌లో ఉత్పత్తి 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. 169 ఎకరాల విస్తీర్ణంలో నెలకొంటున్న ఈ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం ఏటా 12 కోట్ల యూనిట్లు.

ఈ ఏడాది 10 లక్షలకుపైగా మేడిన్‌ ఇండియా మొబైల్స్‌ను ఎగుమతి చేసే పనిలో నిమగ్నమైనట్టు కంపెనీ వెల్లడించింది. తొలిసారిగా వివో మేడిన్‌ ఇండియా ఫోన్లు గతేడాది థాయ్‌లాండ్, సౌదీ అరేబియాకు ఎగుమతి అయ్యాయి. భారత్‌లో విక్రయిస్తున్న ప్రతి వివో ఫోన్‌ దేశీయంగా తయారైనదే. బ్యాటరీ 95 శాతం, చార్జర్‌ విడిభాగాలు 70 శాతం స్థానికంగా సేకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 

ఇప్పటికే గ్రేటర్‌ నోయిడాలో వివో తయారీ కేంద్రం ఉంది. రూ. 7,500 కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా తొలిదశలో 2023 చివరినాటికి ర.3,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ‘ఇప్పటికే రూ. 2,400 కోట్లు వ్యయం చేశాం. మరో రూ. 1,100 కోట్లు డిసెంబర్‌ కల్లా పూర్తి చేస్తాం’ అని కంపెనీ తెలిపింది. ఇక్కడ అడుగు పెట్టిన నాటి నుండి వ్యూహాత్మక మార్కెట్‌ గా భారత్‌ కొనసాగుతోందని వివో ఇండియా బ్రాండ్‌ స్ట్రాటజీ హెడ్‌ యోగేంద్ర శ్రీరాముల తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top