Sakshi News home page

పైలెట్ల కొరత.. ఎయిర్‌ విస్తారా కీలక నిర్ణయం

Published Sun, Apr 7 2024 9:29 PM

Vistara Cancel Up To 25-30 Flights Per Day - Sakshi

ప్రముఖ ఏవియేషన్‌ సంస్థ ఎయిర్‌ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత కారణంగా విమాన కార్యకలాపాల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. విస్తారా రోజుకు దాదాపు 350 విమానాలను నడుపుతోంది. వాటిల్లో 25-30 విమానాల వరకు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

విస్తారా విమానాల రద్దు కారణంగా ముఖ్యంగా మెట్రో మార్గాల్లో ఛార్జీలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ-ముంబై రూట్‌లో విస్తారా రోజుకు దాదాపు 18 విమానాలను నడుపుతుండగా..ఇండిగో 19 విమానాలను నడుపుతోంది.

‘మేము మా కార్యకలాపాలను రోజుకు సుమారు 25-30 విమానాలు, అంటే 10శాతం సేవల్ని నిలిపివేస్తున్నాం. ఫిబ్రవరి 2024 చివరి వరకు ఎన్ని విమానాలు నడిపామో.. ఇక నుంచి అన్నే విమానాల్లో ప్రయాణికులకు సేవలందించాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో ఎయిర్‌ విస్తారా తెలిపింది. 

ఈ సందర్భంగా విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ మాట్లాడుతూ..మా సంస్థ పైలట్‌లను ఎక్కువగా వినియోగించుకుంటోందని, అంతరాయం కారణంగా సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. ఇకపై ఎక్కువ మంది పైలట్‌లను నియమించుకోవడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement