వికాస్‌ లైఫ్‌కేర్‌ చేతికి స్కై 2.0 | Vikas Lifecare to acquire 60percent stake in Dubai-based entity | Sakshi
Sakshi News home page

వికాస్‌ లైఫ్‌కేర్‌ చేతికి స్కై 2.0

Jan 23 2024 5:56 AM | Updated on Jan 23 2024 5:56 AM

Vikas Lifecare to acquire 60percent stake in Dubai-based entity - Sakshi

న్యూఢిల్లీ: దేశీ కంపెనీ వికాస్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ తాజాగా దుబాయ్‌ సంస్థ స్కై 2.0 క్లబ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు 7.9 కోట్ల డాలర్లు(సుమారు రూ. 650 కోట్లు) వెచి్చంచనుంది.  2023–24 లోపు వాటా కొనుగోలు ప్రక్రియ ముగియనున్నట్లు కంపెనీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది.

స్కై 2.0 క్లబ్‌ హోల్డింగ్‌ సంస్థ బ్లూ స్కై ఈవెంట్‌ హాల్‌ ఎఫ్‌జెడ్‌–ఎల్‌ఎల్‌సీ(దుబాయ్‌)తో ఇందుకు వాటా మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 60% వాటాతోపాటు.. భవిష్యత్‌ బిజినెస్‌ వెంచర్లనూ సొంతం చేసుకోనున్నట్లు వివరించింది. 13 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో ఇందుకు డీల్‌ కుదిరినట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement