కెనరాబ్యాంక్‌ కస్టమర్లకు మెరుగైన డిజిటల్‌ సేవలు

UPI Lite among key digital payment initiatives launched - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ తన కస్టమర్లకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించే దిశగా ముందడుగు వేసింది. రోజువారీ లావాదేవీలను సులభతరం చేస్తూ, యూపీఐ ఎల్‌ఐటీఈ, కెనరా క్యూఆర్‌ సౌండ్‌బాక్స్, కెనరా ఏఐ1 మర్చంట్‌ యాప్‌లను ఆవిష్కరించింది.

‘యూపీఐ ఎల్‌ఐటీఈ’.. రూ.200 వరకూ తక్కువ స్థాయిలో విలువ లావాదేవీ నిర్వహించడంసహా పలు ప్రయోజనాలను అందించే ఒక ‘‘ఆన్‌–డివైస్‌’’ వాలెట్‌. గరిష్ట రోజువారీ వినియోగ విలువ పరిమితి రూ.4,000. ఇక ఇన్‌స్టెంట్‌ క్యూఆర్‌ పేమెంట్‌ కన్ఫర్మేషన్‌సహా పలు ప్రయోజనాలను ‘కెనరా క్యూఆర్‌ సౌండ్‌బాక్స్‌’ ద్వారా లభ్యమవుతాయి. ఆన్‌బోర్డెడ్‌ బీహెచ్‌ఐఎం క్యూఆర్‌ మర్చంట్స్‌కు ‘కెనరా ఏఐ1’ యూజర్‌ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌గా ఉండనుంది. ఈ కీలక ఫీచర్ల కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్‌ సీనియర్‌ అధికారులను చిత్రంలో తిలకించవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top