ట్విటర్‌ బ్లూటిక్‌ ఒక్కటే కాదు! ఎవరెవరికి ఏ కలర్‌ అంటే?

Twitter Blue With Gold Grey Blue Check Marks to Relaunch December 2 - Sakshi

వచ్చే శుక్రవారమే వెరిఫికేషన్‌ సర్వీసు రీలాంచ్‌

న్యూఢిల్లీ: ట్విటర్‌ కొత్త బాస్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ ఫీజును రీలాంచ్‌ చేయనున్నారు.  ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ట్విటర్ బ్లూ డిసెంబర్ 2న ప్రారంభమవుతుందని మస్క్ శుక్రవారం తెలిపారు. అయితే వివిధ వర్గాలకు  వేరు వేరు  కలర్స్ టిక్‌ మార్క్‌ను ప్రకటించడం గమనార్హం.

కంపెనీలకు గోల్డ్ కలర్‌ మార్క్, ప్రభుత్వానికి గ్రే కలర్‌, సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులకు బ్లూ కలర్‌ చెక్ మార్క్‌ కేటాయిస్తున్నట్టు మస్క్ తాజాగా ట్వీట్‌ చేశారు. వెరిఫికేషన్‌ ఫీజును తాత్కాలికంగా  డిసెంబర్ 2న ప్రారంభించ బోతున్నట్టు తెలిపారు. దీనిపై ట్విటర్‌ యూజర్‌ ట్వీట్‌కు స్పందిస్తూ బ్లూటిక్‌ సర్వీసును  పునః ప్రారంభించడంలో ఆలస్యమైనందుకు  క్షమాపణలు కోరిన మస్క్‌ ఈ వివరాలు అందించారు. అయితే  వీటికి వేర్వేరు ఫీజు నిర్ణయిస్తారా, ఒకటే ఉంటుందా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. (లంబోర్గినీ సూపర్ ఎస్‌యూవీ వచ్చేసింది: కళ్లు చెదిరేలా!)

మూడు రకాల ఖాతాల మధ్య తేడాను గుర్తించడానికే వివిధ రంగుల చెక్ మార్కులను ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు. దీంతోపాటు నకిలీ ఖాతాలకు చెప్పేలా ఆయా ఖాతాలను మాన్యువల్‌గా ధృవీకరించనున్నట్టు కూడా తెలిపారు. బాధాకరమే అయినా తప్పనిసరి నిర్ణయం అంటూ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అలాగే బ్లూటిక్‌ మార్క్ గతంలో రాజకీయ నాయకులు,  సెలబ్రిటీలు,  పాత్రికేయులు,ఇతర ప్రజా ప్రముఖుల ధృవీకరించబడిన ఖాతాల కోసం రిజర్వ్ చేసినట్టు గుర్తు చేశారు. (సినీ నటి కాజల్‌ అగర్వాల్‌ కొత్త అవతార్‌: అదేంటో తెలుసా?)

కాగా ట్విటర్‌ టేకోవర్‌ తరువాత  మస్క్‌ తీసుకున్న పలు సంచలన నిర్ణయాల్లో బ్లూటిక్‌ వెరి ఫికేషన్‌ ఫీజు  కూడా ఒకటి.  తొలుత నెలకు 8 డాలర్లు బ్లూ చెక్ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసును ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి మస్క్‌, నకిలీ ఖాతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడంతో  దీన్ని ఇప్పటికి  రెండు సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top