హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు

TSREDCO Will going To be Establish Battery Swaping Centres In Hyderabad - Sakshi

చూస్తుండగానే ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం పెరిగిపోతుంది. రోజుకో కొత్త కంపెనీ మార్కెట్‌లోకి వస్తోంది. మరోవైపు పెట్రోలు ధరలు భయపెడుతూనే ఉన్నాయి. అయితే ఈవీ వాహనాలకు కొందామనుకునే వారికి ఎదురయ్యే పెద్ద సమస్య దారి మధ్యలో బ్యాటరీ డిస్‌ఛార్జ్‌ అయితే పరిస్థితి ఏంటీ అని? పెట్రోల్‌ బంకుల తరహాలో బ్యాటరీలు మార్చుకునే అవకాశం ఉంటే బాగుండని భావన అనేక మందిలో ఉంది. 

ఎలక్ట్రిక్‌ వాహానాల వాడకంలో ఉన్న ఇబ్బందులను గుర్తించి బ్యాటరీ స్వాపింగ్‌ సెంటర్లు నగరంలో ఏర్పాటు చేసే సన్నహాలు చేస్తోంది తెలంగాణ స్టేట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (టీఎస్‌ఆర్‌ఈడీసీవో). ఈ మేరకు నగరంలో ఫస్ట్‌ ఫేస్‌లో కనీసం ఆరు బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ నాలుగు దిక్కులతో పాటు నగరం మధ్యన రెండు బ్యాటరీ స్వాపింగ్‌ సెంటర్లు రానున్నాయని టీఎస్‌ఈర్‌ఈడీసీవో అధికారులు తెలిపారు.

బ్యాటరీ స్వాపింగ్‌ సెంటర్లలో ఒక్కోక్కటి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల విలువైన స్వాపింగ్‌ బ్యాటరీలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈవీ సెగ్మెంట్‌కి సంబంధించి టూ, త్రీ వీలర్లే ఎక్కువగా ఉన్నాయి. వీటికి అనుగుణమైన బ్యాటరీలను ఫస్ట్‌ ఫేజ్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఎల్‌పీజీ సిలిండర్‌ మార్చుకున్నంత తేలికగా ఈ స్టేషన్లలో బ్యాటరీలు మార్చుకోవచ్చని అధికారులు అంటున్నారు. 

చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top