Triumph Street Triple R RS Bikes Launched in India Price and Features - Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి కొత్త స్పోర్ట్స్‌ బైక్‌లు.. ధరలు, ఫీచర్లు ఇవే..

Jun 16 2023 6:34 PM | Updated on Jun 16 2023 6:56 PM

triumph street triple r rs bikes launched in india price and features - Sakshi

ట్రయంఫ్ (Triumph) మోటార్‌సైకిల్స్ ఇండియా కొత్త ప్రీమియం బైక్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2023 స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ఎస్, స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ మోడళ్లను పరిచయం చేసింది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ ధర రూ. 10.17 లక్షలు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌ ధర రూ. 11.81 లక్షలు. (ఎక్స్‌ షోరూమ్‌) 

కలర్స్‌ ఇవే..
ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ సిల్వర్ ఐస్, క్రిస్టల్ వైట్ కలర్‌ ఆప్షన్లలో వస్తుంది. అలాగే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌ సిల్వర్ ఐస్, కార్నివాల్ రెడ్, కాస్మిక్ ఎల్లో అనే మూడు రంగుల్లో లభ్యమవుతుంది.

స్పెసిఫికేషన్లు
2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో లిక్విడ్-కూల్డ్, 765 సీసీ ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ ఉంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ ఇంజిన్ 11,500 ఆర్‌పీఎం వద్ద 118.4 బీహెచ్‌పీ, 9,500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 80 ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇక స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌ 12,000 ఆర్‌పీఎం వద్ద 128.2 బీహెచ్‌పీ అధిక అవుట్‌పుట్‌ను 9,500 ఆర్‌పీఎం వద్ద 80 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

ఫీచర్స్‌
ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌ బైక్‌లో కార్నరింగ్ ఏబీఎస్‌, లీన్-యాంగిల్ సెన్సిటివిటీతో ట్రాక్షన్ కంట్రోల్, లింక్డ్ బ్రేకింగ్ సిస్టమ్, వీలీ కంట్రోల్, ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. మరోవైపు  2023 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ నాలుగు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లో ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆర్‌ఎస్‌ మోడల్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో టీఎఫ్‌టీ స్క్రీన్‌ ఉన్నాయి. ల్యాప్ టైమర్,  క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన ట్రాక్ ఉపయోగం కోసం ఆర్‌ఎస్‌ వేరియంట్‌ను మరింత అనుకూలంగా ఉండేలా రూపొందించారు.

Advertisement
 
Advertisement
Advertisement