
టెక్నాలజీ విస్తరిస్తోంది.. ప్రపంచం పరుగెడుతోంది. సమయం చాలా ముఖ్యమైపోయింది. ఇలాంటి సమయంలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని ప్రభుత్వ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇవి మీ సమయాన్ని మాత్రమే కాకుండా.. అవసరమైన గవర్నమెంట్ సర్వీసులను ఉపయోగించుకోవడానికి కూడా అనుమతిస్తాయి.
ఉమాంగ్ (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్)
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి స్థానిక ప్రభుత్వ సంస్థల వరకు దేశవ్యాప్త ఈ-గవర్నమెంట్ సేవలను యాక్సెస్ చేయడానికి 'ఉమాంగ్' యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో పీఎఫ్ క్లెయిమ్స్ అప్లై చేసుకోవడం దగ్గర నుంచి.. యుటిలిటీ బిల్లులు చెక్ చేసుకోవడం వరకు ఉన్నాయి. ఇది సుమారు 1500 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలకు ఒక ప్లాట్‌ఫామ్.
పన్ను చెల్లింపుదారుల కోసం ఏఐఎస్
ఏఐఎస్ యాప్ అనేది.. భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను శాఖ అందించే ఫ్రీ మొబైల్ అప్లికేషన్. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS)కు సంబంధించిన సమాచారాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ యాప్ పనిచేస్తుంది. ఇందులో పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను అందించవచ్చు.
డిజిలాకర్
డిజిలాకర్ అనేది.. భారతదేశంలో ప్రభుత్వ మద్దతుతో పనిచేసే అప్లికేషన్. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) దీనిని ప్రారంభించారు. పేపర్‌లెస్ పాలనను ప్రోత్సహించడానికి ప్రారంభించిన ఈ అప్లికేషన్ ముఖ్యమైన డాక్యుమెంట్స్ (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో డాక్యుమెంట్స్ ఉంటే ఫిజికల్ కాపీలను చూపించాల్సిన అవసరం లేదు.
డిజియాత్ర
విమానాశ్రయాలలో వేగవంతమైన చెక్-ఇన్‌ల కోసం డిజియాత్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది అనేక ప్రధాన నగరాల్లో పనిచేస్తుంది.
ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్
బ్రోకర్ అవసరం లేకుండా నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా సురక్షితమైనది, పారదర్శకమైనది. అంతే కాకుండా పెట్టుబడికి సంబంధించిన మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.
పోస్ట్ఇన్ఫో
పోస్ట్ఇన్ఫో అనేది ఇండియా పోస్ట్ యాప్. దీని ద్వారా స్పీడ్ పోస్ట్‌లను ట్రాక్ చేయవచ్చు. పోస్టల్ ధరలను చెక్ చేసుకోవచ్చు. మీకు సమీపంలో ఏ పోస్టాఫీసులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
స్వయం (SWAYAM)
స్వయం యాప్ ద్వారా IIT, IIM వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రతిదానిని కవర్ చేయవచ్చు. ఇందులో ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులను పొందవచ్చు. విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితం
112 ఇండియా
పోలీసులు, అగ్నిమాపక & అంబులెన్స్ సేవలను తక్షణమే పొందటానికి 112 ఇండియా యాప్ ఉపయోగపడుతుంది. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ యాప్, దీనిని పౌరులు అత్యవసర సమయంలో సహాయం కోరడానికి ఉపయోగించవచ్చు.
భీమ్ యూపీఐ
భీమ్ యూపీఐ అనేది నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది. ఇది ప్రభుత్వ యూపీఐ యాప్. ఇది సింపుల్ అండ్ సెక్యూర్ కూడా.
నెక్స్ట్‌జెన్ ఎంపరివాహన్
ఆర్‌సీ, డీఎల్ యొక్క డిజిటల్ వెర్షన్‌లను యాక్సెస్ చేయడానికి మాత్రమే కాకుండా.. చలాన్‌లను చెక్ చేయడానికి నెక్స్ట్‌జెన్ ఎంపరివాహన్ యాప్ ఉపయోగపడుతుంది.
దీక్ష (DIKSHA)
దీక్ష అనేది పాఠశాల విద్యార్థులు.. ఉపాధ్యాయుల కోసం ఉపయోగపడే ఒక ఇ-లెర్నింగ్ యాప్. ఇది పాఠ్యాంశాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యా కంటెంట్‌ను అందిస్తుంది.
జన్ ఔషధి సుగం
సరసమైన ధరలకు జనరిక్ మందులను, సమీపంలోని జన్ ఔషధి కేంద్ర స్థానాలను సులభంగా కనుగొనడానికి 'జన్ ఔషధి సుగం' యాప్ ఉపయోగపడుతుంది.