
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టయోటా వాహనాల కొనుగోలుకై కస్టమర్లకు సమగ్ర రుణ సౌకర్యాన్ని బ్యాంకు కల్పించనుంది.
ఆన్‌రోడ్ ధరపై 90 శాతం వరకు లోన్ సమకూరుస్తారు. యూనియన్ వెహికిల్ స్కీమ్ కింద 84 నెలల వరకు ఈఎంఐ సౌకర్యం ఉంది. యూనియన్ పరివాహన్ స్కీమ్‌లో భాగంగా వాణిజ్య వాహనాలకు 60 నెలల వరకు వాయిదాలు ఆఫర్ చేస్తారు. అన్ని రకాల టయోటా వాహనాలకు కొత్త స్కీమ్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.