టయోటా కొత్త ప్లాంటుకు రూ.3,300 కోట్లు 

Toyota Investment Of Rs 3,300 Crore To Set Up Third Manufacturing Facility - Sakshi

బెంగళూరు: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ భారత్‌లో మూడవ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది.

2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. రెండు షిఫ్టులలో 1 లక్ష యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిదాడిలో ఇప్పటికే సంస్థకు రెండు యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.42 లక్షల యూనిట్లు.

మల్టీ–యుటిలిటీ వెహికిల్‌ ఇన్నోవా హైక్రాస్‌తోపాటు వివిధ ఇంధన సాంకేతికతలతో మోడళ్లను తయారు చేసేందుకు భవిష్యత్‌కు అవసరమయ్యే స్థాయిలో కొత్త ప్లాంట్‌ ఉంటుందని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్‌ విక్రమ్‌ గులాటీ తెలిపారు. కొత్త ప్లాంట్‌ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్లలో 11,200 మంది పని చేస్తున్నారని వివరించారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top