Toyota: టయోటా హైబ్రిడ్‌ కార్‌ సరికొత్తగా..! పెట్రోల్‌తోనే కాదు కరెంటుతో కూడా నడుస్తోంది..! ఈ కారు..!

Toyota Camry Hybrid Facelift Launched In India - Sakshi

టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఫేస్‌లిఫ్టెడ్ క్యామ్రీ హైబ్రిడ్‌ను విడుదల చేసింది. టయోటా క్యామ్రీ సరికొత్త ఫీచర్స్‌తో, కొత్త కలర్ ఆప్షన్‌తో, ఇంటీరియర్స్‌లో సరికొత్త మార్పులతో రానుంది.  2022 టయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారు ధర రూ. 41.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారులో 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజన్‌తో సీవీటీతో జతచేయబడి ఉంది. 

డిజైన్‌లో సరికొత్తగా..!
టయోటా న్యూ క్యామ్రీ కొత్త బంపర్, క్రోమ్ ఇన్సర్ట్స్‌తో గ్రిల్‌ పొందుతుంది. టెయిల్‌ల్యాంప్‌లను సరికొత్తగా డిజైన్‌ చేశారు. అంతేకాకుండా బ్లాక్ బేస్ ఎక్స్‌టెన్షన్‌లతో కూడిన ఎరుపు ఎల్‌ఈడీ బ్రేక్ లైట్ల క్లస్టర్‌ను కలిగి ఉంది. డార్క్ మెటాలిక్ ఫినిషింగ్‌తో కొత్త 18-అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ కారుకు మరింత ఆకర్షణీయంగా నిలవనుంది. 

ఇంటీరియర్స్‌ విషయానికి వస్తే..!
సెంట్రల్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్‌లో బ్లాక్ ఇంజనీర్డ్ వుడ్ ఎఫెక్ట్ ఫిల్మ్‌ను జోడించడంతో క్యాబిన్ లోపల కొత్త లుక్ రానుంది. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో రెండింటిలోనూ అందుబాటులో ఉంది. 9-స్పీకర్ జేబీఎల్‌ ఆడియో సిస్టమ్‌తో జత చేయబడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఫ్లోటింగ్ డిస్‌ప్లేను కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది.  కారులో ముఖ్యంగా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌, 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, మెమరీ అసిస్టెడ్ టిల్ట్-టెలీస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, హెడ్స్-అప్ డిస్‌ప్లేను టయోటా ఏర్పాటుచేసింది.

మరిన్నీ ఫీచర్స్‌..!
కారులోని రిక్లైనింగ్ సీట్స్‌, పవర్ అసిస్టెడ్ రియర్ సన్‌షేడ్, క్లైమేట్ కంట్రోల్, ఆడియో సెట్టింగ్స్‌తో కూడిన టచ్ ప్యానెల్, 3-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అమర్చారు. టయోటా క్యామ్రీలో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ అసిస్ట్, క్లియరెన్స్ అండ్‌ బ్యాక్ సోనార్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి యాక్టివ్, ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ 2.5-లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌ను కల్గి ఉంది. 218bhp శక్తిని ఉత్పత్తి చేయనుంది. 221ఎన్‌ఎమ్‌ టార్క్‌ను అందిస్తోంది. హైబ్రిడ్‌ సిస్టమ్‌లో భాగంగా 245V నికెల్‌ మెటల్‌ హైడ్రైడ్‌ బ్యాటరీతో రానుంది.  

కర్భన ఉద్గారాలను పూర్తిగా ఆపివేసే ప్రయత్నంలో భాగంగా టయోటా తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని టీకేఎమ్‌ సేల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతూల్‌ సూద్‌  అన్నారు. క్యామ్రీ భారతీయ మార్కెట్లలో 2013లోనే ప్రవేశపెట్టినప్పటీకీ, ఇప్పుడు వచ్చిన ఫేస్‌లిఫ్ట్‌ క్యామ్రీ భారతీయులను మరింత ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు. 

చదవండి: సరికొత్తగా హోండా సీబీఆర్‌300ఆర్‌ బైక్‌..! ధర ఎంతంటే...?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top