ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే?

Top 5 Youngest Billionaires In The World - Sakshi

Top 5 Youngest Billionaires: ఫోర్బ్స్ ఇటీవల ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొదటి ఐదు స్థానాల్లో ఎవరు ఉన్నారు, వారు ఎలా సంపాదిస్తున్నారు, వారి ఆస్తులు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

క్లెమెంటే డెల్ వెచియో
ఫోర్బ్స్  విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో అగ్ర స్థానం పొందిన వ్యక్తి 'క్లెమెంటే డెల్ వెచియో'. ఇతని ఆస్తి 4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30వేల కోట్ల కంటే ఎక్కువ. ఇటాలియన్ బిలియనీర్ లియోనార్డో డెల్ వెచియో కుమారుడు క్లెమెంటే, తండ్రి మరణం తర్వాత వారసత్వంగా 12.5 శాతం వాటాను పొంది.. 18 సంవత్సరాలకే ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు.

కిమ్ జంగ్ యౌన్
సౌత్ కొరియాకు చెందిన 'కిమ్ జంగ్ యౌన్' ఫోర్బ్స్  విడుదల చేసిన యంగెస్ట్ బిలియనీర్ల జాబితాలో రెండవ స్థానం పొందిన యువకుడు. ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారు కూడా. తన తండ్రి కిమ్ జంగ్-జు 2022లో 54 ఏళ్ల వయసులో మరణించిన తరువాత ఇతని ఆస్తి 2.5 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. ఇతని వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు.

కెవిన్ డేవిడ్ లెమాన్
జర్మనీకి చెందిన కెవిన్ డేవిడ్ లెమాన్ దేశంలోని డ్రగ్‌స్టోర్ చైన్ డీఎమ్ (Drogerie Markt)లో 50 శాతం యాజమాన్య వాటాను కలిగి ఉన్నాడు. దీని వార్షిక ఆదాయం 14 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. గొయెట్జ్ వెర్నర్ జర్మనీలోని కార్ల్స్‌రూహ్‌లో తన మొదటి డిఎమ్ స్టోర్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటికి 3,700 కంటే ఎక్కువ ప్రదేశాలలో స్టోర్‌లను కలిగి ఉన్నట్లు సమాచారం.

1974లో కెవిన్ డేవిడ్ లెమాన్ తండ్రి గెంతెర్ (Guenther) 'డీఎమ్'లో పెట్టుబడి పెట్టారు. ఆ తరువాత 2017లో కెవిన్ డేవిడ్‌కు 50శాతం వాటాను బదిలీ చేశారు. ఇతని ఆస్తి ఫోర్బ్స్  ప్రకారం 1.7 బిలియన్ డాలర్లు అని తెలుస్తోంది.

కిమ్ జంగ్ మిన్
ఫోర్బ్స్ జాబితా ప్రకారం, కిమ్ జంగ్ మిన్ నాలువ అతి తక్కువ వయసున్న బిలియనీర్. దక్షిణ కొరియాకు చెందిన ఈమె NXCలో సుమారు 31 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ప్రఖ్యాత ఆన్‌లైన్ గేమింగ్ దిగ్గజం నెక్సాన్‌లో అతిపెద్ద వాటాదారుగా కూడా ఉంది. కిమ్ జంగ్ మిన్ ఆస్తి 1.4 బిలియన్ డాలర్లు.

ఇదీ చదవండి: 19 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఆస్తి ఎంతో తెలిస్తే అవాక్కవుతారు!

లూకా డెల్ వెచియో
ఫోర్బ్స్ జాబితాలో ఐదవ యంగెస్ట్ బిలియనీర్ లూకా డెల్ వెచియో. 22 సంవత్సరాల ఇతడు దివంగత లియోనార్డో డెల్ వెచియో ఆరుగురి సంతానంలో ఒకరు. తండ్రి ఆస్తిలో 12.5  శాతం వారసత్వ వాటా రావడం మాత్రమే కాకుండా.. ఇతడు ఎస్సిలర్‌లుక్సోటికా హోల్డింగ్‌లు, ఇన్సూరెన్స్ జనరల్‌లో షేర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ కోవివియోలో కూడా షేర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top