ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!

Top 10 Trending Phones of This Week - Sakshi

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో ప్రజలు బాగా  టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. డిసెంబర్ మొదటి వారంలో కూడా పోకో ఎమ్3 మొదటి స్థానంలో నిలిచింది. గత వారం 7వ స్థానంలో నిలిచిన రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఈ వారంలో 2వ స్థానంలో నిలిచింది. అక్టోబర్ నెలలో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ తన స్థానాన్ని కోల్పోకుండా మూడవ స్థానంలో ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన శామ్‌సంగ్ గెలాక్సీ ఎ51 ఇప్పుడు 2 స్థానాలు పైకి ఎగబాకి 4వ స్థానంలో నిలిచింది. యధాతదంగా షియోమీ రెడ్‌మి నోట్ 9 ప్రో తన స్థానాన్ని నిలుపుకొని ఐదవ స్థానంలో నిలిచింది. గత వారం నాల్గవ స్థానంలో నిలిచిన షియోమీ పోకో ఎక్స్3 ఎన్ఎఫ్ సి ఈ వారం 6వ స్థానంలో ఉంది. కొత్తగా రాబోయే షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ ఏడవ స్థానంలో ఉంది. తరువాత 8,9,10 స్థానాలలో శామ్‌సంగ్ గెలాక్సీ A21ఎస్, శామ్‌సంగ్ గెలాక్సీ A71, ఇన్ఫినిక్స్ జీరో 8ఐ ఉన్నాయి.   

ర్యాంక్ 1: పోకో ఎమ్3

ర్యాంక్ 2: రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ

 

ర్యాంక్ 3: ఐఫోన్ 12 ప్రో మాక్స్

 

ర్యాంక్ 4: శామ్‌సంగ్ గెలాక్సీ ఎ51

 

ర్యాంక్ 5:  రెడ్‌మి నోట్ 9 ప్రో

ర్యాంక్ 6: పోకో ఎక్స్3 ఎన్ఎఫ్ సి

ర్యాంక్ 7: ఎంఐ 10టీ ప్రో 5జీ

ర్యాంక్ 8: శామ్‌సంగ్ గెలాక్సీ A21ఎస్

ర్యాంక్ 9: శామ్‌సంగ్ గెలాక్సీ A71

ర్యాంక్ 10: ఇన్ఫినిక్స్ జీరో 8ఐ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top