ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ | Top 10 Trending Phones In This Week | Sakshi
Sakshi News home page

ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్

Nov 23 2020 1:03 PM | Updated on Nov 23 2020 1:45 PM

Top 10 Trending Phones In This Week - Sakshi

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. మొబైల్ వినియోగదారులు వరుసగా గత రెండు వారలుగా పోకో ఎమ్3 మొబైల్ గురుంచి తెగ సెర్చ్ చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం కొత్తగా తీసుకురాబోయే పోకో ఎమ్3 ఈ వారంలో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత ఐఫోన్ 12 ప్రో మాక్స్ రెండవ స్థానంలో నిలిచింది.

కొత్తగా రాబోయే ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా గురుంచి లీక్స్ రావడంతో దీని గురుంచి తెగ వెతికేయడం వల్ల ఇది 3వ స్థానంలో నిలిచింది. నాల్గవ స్థానంలో పోకో ఎక్స్ 3 ఎన్‌ఎఫ్‌సి ఉంది, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 51 విడుదలై దాదాపు ఒక సంవత్సరం అవుతున్న ఇంకా ట్రేండింగ్లో ఉంటూ 5వ స్థానంలో నిలవడం విశేషం. రెడ్‌మి నోట్ 9ప్రో 6వ స్థానానికి పడిపోగా, గత వారంతో పోలిస్తే ఐఫోన్ 12 రెండు స్థానాలు పెరిగి ఏడవ స్థానంలో నిలిచింది. షియోమి మీ 10టీ ప్రో రెండు వారాల తర్వాత 8వ స్థానంలో నిలిచింది. గెలాక్సీ ఎమ్ 51 9వ స్థానంలోను, గెలాక్సీ ఎ21 చివరి స్థానంలో నిలిచింది. 

ర్యాంక్ 1: షియోమి పోకో ఎం 3



ర్యాంక్ 2: ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్



ర్యాంక్ 3: శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 అల్ట్రా 5 జి



ర్యాంక్ 4: షియోమి పోకో ఎక్స్ 3 ఎన్ఎఫ్ సి 



ర్యాంక్ 5: శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 51
 



ర్యాంక్ 6: షియోమి రెడ్‌మి నోట్ 9 ప్రో



ర్యాంక్ 7: ఆపిల్ ఐఫోన్ 12 



ర్యాంక్ 8: షియోమి మి 10టీ ప్రో 5 జి



ర్యాంక్ 9: శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 51 



ర్యాంక్ 10: శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 21 ఎస్ 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement