
జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం దెబ్బకు దేశీయ స్టాక్ మార్కెట్‌లు విలవిల్లాడుతున్నాయి. సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్‌లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరుతెన్నులు, పెరిగిపోతున్న కరోనా కేసులు, ఉక్రెయిన్ రష్యా యుద్ధ పరిణామాల నుంచి దేశీయ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.38నిమిషాలకు సెన్సెక్స్ 593 పాయింట్లు నష్టపోయి 56610 వద్ద నిఫ్టీ 189 పాయింట్లు నష్టపోయి 16977 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతి సుజికీ, ఎథేర్ మోటర్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..బీపీసీఎల్, బ్రిటానియా, టాటా స్టీల్, జేఎస్‌డ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, అపోలో హాస్పిటల్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో, కోల్ ఇండియా షేర్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి.