తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..? | Today Gold Price On 17 June 2024 | Sakshi
Sakshi News home page

తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..?

Jun 17 2024 12:56 PM | Updated on Jun 17 2024 1:02 PM

today gold rates on commodity market in main cities in the country

ఈక్విటీమార్కెట్‌లు ఇటీవల కాలంలో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో సోమవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,300 (22 క్యారెట్స్), రూ.72,330 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఆదివారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.220, రూ.220 తగ్గింది.

చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.150, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.170 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.66,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.72,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,450.. 24 క్యారెట్ల ధర రూ.72,480కు చేరాయి. మార్కెట్‌లో కేజీ వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.95,600 వద్ద స్థిరంగా ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement
 
Advertisement
Advertisement