తగ్గిన బంగారం ధరలు - తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇలా! | Gold, Silver Price Today, September 11, 2023: Check Latest Price - Sakshi
Sakshi News home page

Gold Price: తగ్గిన బంగారం ధరలు - తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇలా!

Published Mon, Sep 11 2023 12:54 PM

Today Gold And Silver Price Details - Sakshi

దేశీయ మార్కెట్లో ఈ రోజు (2023 సెప్టెంబర్ 11) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,840కు చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధర రూ. 10 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 10 తగ్గి రూ. 59,830కు చేరింది.

ఒక గ్రామ్ 22 క్యారెట్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ. 5484 & రూ. 5983గా ఉన్నాయి. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54990 కాగా 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రూ. 59830గా ఉంది. ముంబై, పూణే, కేరళలో కూడా ఇదే ధరలు ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, కడపలలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 54,840 కాగా 24 క్యారెట్ల గోల్డ్ (10 గ్రాములు) ప్రైస్ రూ. 59,830 వద్ద ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55320 కాగా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,340 వద్ద ఉంది. ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలలో హెచ్చు తగ్గులకు కారణమవుతుందని తెలుస్తోంది.

వెండి ధరలు..
వెండి ధరలు ఈ రోజు కొంత పెరిగినట్లు తెలుస్తుంది. 100 గ్రాముల వెండి ధర రూ. 7750 కాగా 1 కేజీ వెండి ధర రూ. 77500గా ఉంది. నిన్న ఒక కేజీ వెండి ధర రూ. 77000 కావడం గమనార్హం. హైదరాబాద్, విజయవాడలో కేజీ సిల్వర్ ధర రూ. 77500గా ఉంది. బెంగళూరులో కేజీ వెండి రూ. 73000 కావడం గమనార్హం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement