3 కోట్ల టిక్‌టాక్ వీడియోల తొలగింపు‌.. | Sakshi
Sakshi News home page

3 కోట్ల టిక్‌టాక్ వీడియోల తొలగింపు‌..

Published Tue, Sep 22 2020 5:21 PM

TikTok Removes Three Crore Videos From India - Sakshi

ముంబై: భారత్‌ చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో వీడియో షేరింగ్ యాప్ టిక్‌టిక్‌ను భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే. కాగా 2020 సంవత్సరం మొదటి అర్ధభాగంలో టిక్‌టాక్ తన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, భారత్‌ నుంచి 3.7 కోట్లకు పైగా వీడియోలను తొలగించినట్లు యాజమాన్యం తన పారదర్శక నివేదికలో పేర్కొంది.  ప్రతి సంవత్సరం టిక్‌టాక్‌ సంస్థ పారదర్శక నివదేక విడుదల చేస్తుంది. అయితే 2020 మొదటి అర్ధభాగంలో భారత్‌ నుంచి 3,76,82,924 వీడియోలు, ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల పైగా వీడియోలు మార్గాదర్శకాలు పాటించనందుకు తొలగించామని సంస్థ పేర్కొంది.

అయితే అనేక ఫిర్యాదులు, కంటెంట్‌ల విషయంలో ప్రభుత్వ సంస్థల నుంచి కొన్ని అభ్యర్థనలు వచ్చాయని, వాటిని పరిశీలించి వీడియోలను తొలగించినట్లు నివేదిక తెలిపింది. మార్గదర్శకాలను అధ్యయనం చేయడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, అయితే భారత్‌. ఇటలీ, జపాన్‌. స్పేన్‌, యూకే దేశాల నుంచి కోవిడ్‌ సబ్‌కెటీగరీలో కంటెంట్‌కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని సంస్థ తెలిపింది. మరోవైపు యూనిసెఫ్ ఇండియా, యునెస్కో, యుఎన్ ఉమెన్, యుఎన్‌డీపీ ఇండియా, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీల భాగస్వామ్యంతో టిక్‌టాక్‌ పనిచేస్తున్నట్లు సంస్థ నివేదిక పేర్కొంది.
(చదవండి: డీల్ నచ్చలేదు.. సంతకం చేయను : ట్రంప్) 

Advertisement
Advertisement