ఎలన్‌మస్క్‌ నువ్వు ఘటికుడివే! ఆటో‘పైలెట్‌’ వీడియోతో హల్‌చల్‌

Tesla Giga factory Drone Shot Footage is Replicating Autopilot mode - Sakshi

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్‌ మస్క్‌ మరోసారి తనదైన శైలిలో చమక్కుమనిపించారు. ఎవ్వరు కాదన్నా.. విమర్శలు ఎన్ని వచ్చినా తాను అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిండంలో దిట్ట ఎలన్‌ మస్క్‌. తన కలల ప్రాజెక్టయినా ఆటో పైలెట్‌ను అమల్లోకి పెట్టే  ప్రయత్నంలో భాగంగా  తాజాగా టెస్లా రిలీజ్‌ చేసిన వీడియో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. 

అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచనలు చేయడం వాటిని అమల్లో పెట్టడంతో ఎలన్‌ మస్క్‌ది డిఫరెంట్‌ స్టైల్‌. అంతా పెట్రోలు, డీజిల్‌ వాహనాల మార్కెట్‌పై దృష్టి పెట్టినప్పుడు తానొక్కడే ఎలక్ట్రిక్‌ వాహనాల మంత్రం అందుకున్నాడు. ఇప్పుడందరూ ఈవీల పేరు జపిస్తుంటే, తాను మరింత అడ్వాన్స్‌గా ఆలోచించి డ్రైవర్‌ లేకుండా ఆటోపైలెట్‌ మోడ్‌లో నడిచే కార్లను తెస్తానంటున్నాడు. తన ఆటో పైలెట్‌ కాన్సెప్టుకి బలం చేకూర్చే ఓ వీడియోను టెస్లా కంపెనీ తాజాగా రిలీజ్‌ చేసింది.

గత వారం బెర్లిన్‌లో తొలి గిగాఫ్యాక్టరీని ఎలన్‌ మస్క్‌ ప్రారంభించారు. ఇక్కడ భారీ ఎత్తున మోడల్‌ 3 కార్లు తయారవుతున్నాయి. అయితే ఈ ఫ్యా‍క్టరీ ఎంత పెద్దగా ఉంది అక్కడ కార్లు ఎలా తయారవుతున్నాయో తెలియజేస్తూ డ్రోన్‌తో షూట్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో టెస్లా రిలీజ్‌ చేసింది.

డ్రోన్‌ వీడియో ఫుటేజ్‌ ప్రపంచానికి కొత్తేం కాదు.. ఇక్కడే ఎలన్‌ మస్క్‌ మ్యాజిక్‌ చేశాడు. గిగా ఫ్యాక్టరీలో మిషన్లు తయారీ పనుల్లో నిమగ్నమై ఉండగా డ్రోన్‌ షూట్‌ చేసింది. అంటే పని జరిగేప్పుడు ఏదైనా మిషన్‌ అడ్డుగా వస్తే ఆగిపోవడం.. పక్కకు తొలగగానే ముందుకు వెళ్లడం. అవసరాన్ని బట్టి కుడి ఎడమ, పైనా కిందకు డైరెక‌్షన్‌ మార్చుకుంటూ గిగా ఫ్యాక్టరీని షూట్‌ చేసింది. డ్రోన్‌ కెమెరాలో ఆటో పైలెట్‌ మోడ్‌ ఫీచర్‌ను ఇన్‌స్టాల్‌ చేసినట్టుగానే ఈ వీడియో షూట్‌ జరిగింది.

డ్రైవర్‌ లేకుండా ఆటోపైలెట్‌ కార్లను అందుబాటులోకి తేవడం తన లక్ష్యమంటూ ఎలన్‌ మస్క్‌ ఎప్పటి నుంచో చెబుతున్నాడు. అయితే ఈ ఆటోపైలెట్‌పై అమెరికా సహా పలు దేశాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. మరోవైపు ఆటోపైలెట్‌లో ఇంకా కొన్ని అడ్వాన్స్‌మెంట్స్‌ చేయాల్సి ఉందంటూ ఎలన్‌ మస్క్‌ సైతం ఆర్నెళ్ల కిందట ప్రకటించారు.

తాజాగా బెర్లిన్‌ గిగా ఫ్యాక్టరీ డ్రోన్‌ కెమెరా ఫుటేజ్‌ వీడియోను పరిశీలిస్తే టెస్లా ఆటోపైలెట్‌ మోడ్‌ ఫైనల్‌ స్టేజ్‌కి చేరుకున్నట్టే కనిపిస్తోంది. ఆటో పైలెట్‌ మోడ్‌కి సంబంధించి తుది ప్రకటన వెలువడటానికి ముందు ఎలన్‌ మస్క్‌ పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ డ్రోన్‌ వీడియో ఫుటేజ్‌ను రిలీజ్‌ చేసి ఉంటారని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మీరు ఓసారి ఆ డ్రోన్‌ వీడియోపై లుక్కేయండి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top