ఎలాన్‌ మస్క్‌ సంచలనం, నా కొడుకు బ్రెయిన్‌లో ఈ చిప్‌ను అమర్చుతా?

Tesla Ceo Elon Musk Said The Neuralink Brain Chip Is Ready For Human Trials - Sakshi

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా చూసే ఉంటారుగా. ఆ సినిమాలోని హీరోకి చిప్‌ను అమర్చి అతని కదలికల్ని ఎలాగైతే కంట్రోల్‌ చేస్తారో సేమ్‌ టూ సేమ్‌ అలాంటి టెక్నాలజీనే అందుబాటులోకి తేబోతున్నారు బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌. ఈ ప్రాజెక్ట్‌ పట్ల మస్క్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఎంతలా అంటే? అవసరం అయితే తన బ్రెయిన్‌లో, లేదంటే తన కొడుకు బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చుకునేంత ధీమా ఉందన్నారు. 

ఎలాన్‌ మస్క్‌కు కృత్తిమ మేధపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అది మానవులకన్నా తెలివైంది. భవిష్యత్‌లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తోందని తరచూ చెబుతున్నారు. దాన్ని ఎదుర్కొవడానికే న్యూరాలింక్‌ ప్రాజెక్ట్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. ఏఐని అధిగమించేలా మానవుల మేధస్సును సామర్ధ్యాలను పెంచడానికి దోహద పడుతుందని, అందుకే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా న్యూరాలింక్‌ ప్రాజెక్ట్‌ గురించి మస్క్‌ కీలక ప్రకటన చేశారు. మరో 6 నెలల్లో బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ టెక్నాలజీతో మనిషి మెదడులో చిప్‌ పెట్టే ప్రయోగాలను చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. 

బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ టెక్నాలజీ పరిజ్ఞానంపై కాలిఫోర్నియాలోని న్యూరాలింక్‌ ప్రధాన కార్యాలయంలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పక్షపాతం వచ్చిన వారి అవయవాలను కదిలించేలా చేసేందుకు వెన్నపూసలో అమర్చేందుకు వీలుగా చిప్‌, చూపు కోల్పోయిన వారికి సాయపడేలా మరో పరికరాన్ని రూపొందిస్తున్నారు. ఈ రెండింటిలో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మనిషి మెదడులో పెట్టబోయే చిప్‌తో పాటు దాన్ని పుర్రెలో అమర్చగలిగే రోబోను కూడా పరిచయం చేశారు. మనుషులపై ప్రయోగాలు జరిపేందుకు అవసరమైన ప్రయోగాలు జరిపేందుకు ఆహార,ఔషద నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కు సమర్పించేందుకు అన్నీ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉన్నాయని, అలాగే ఇప్పటి వరకు ఎఫ్‌డీఏతో జరిపిన చర్చలన్నీ సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు.

దీంతో పాటు చిప్‌ను అమర్చిన కోతి తనకు ఎదురుగా ఉన్న కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద  జస్ట్‌ మీ కళ్లతో అటూ ఇటూ చూస్తుంటే..మౌస్‌ కర్సర్‌ కదులుతుంది. అది ఏం టైప్‌ చేయాలనుకుంటుందే అదే టైప్‌ అవుతుంది. ఆ వీడియోను ప్రదర్శించారు. బ్రెయిన్‌లో చిప్‌ను అమర్చే ప్రయోగాల పట్ల నమ్మకంగా ఉన్నారు.చిప్‌ను నా బ్రెయిన్‌లో, నా కుమారుడి బ్రెయిన్‌లో అమర్చుకునేంతలా’ అనే ధీమా వ్యక్తం చేశారు. 

చదవండి👉 ఎలాన్‌ మస్క్‌కు మరో ఎదురు దెబ్బ..‘టిమ్‌ కుక్‌ ఇక్కడ ఏం జరుగుతోంది’?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top