ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం ఎన్‌ఈబీపీ టెండర్లు

Tender Issued Under The National Electric Bus Program, Convergence Energy Services - Sakshi

న్యూఢిల్లీ: జాతీయ ఎలక్ట్రిక్‌ బస్‌ ప్రోగ్రాం (ఎన్‌ఈబీపీ) కింద తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,465 ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం ప్రభుత్వ రంగ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ (సీఈఎస్‌ఎల్‌) ఏకీకృత టెండర్లు ఆహ్వానించింది. 

ఇందులో డీజిల్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయం 29 శాతం తక్కువగా ఉండే విధంగా టెండర్లు దాఖలైనట్లు సీఈఎస్‌ఎల్‌ తెలిపింది. 12 మీటర్ల బస్సు (ఇంట్రా–సిటీ)ల నిర్వహణ వ్యయం కిలోమీటరుకు రూ. 54.3గాను, 12 మీటర్ల ఇంటర్‌సిటీ బస్సుకి కిలోమీటరుకు రూ. 39.8/కి.మీ.గాను బిడ్లు వచ్చాయి. అలా గే, 9 మీటర్ల బస్సుకు రూ. 54.46, 7 మీటర్ల బస్సుకు రూ. 61.92 వ్యయం ఉండేలా బిడ్లు వచ్చినట్లు సీఈఎస్‌ఎల్‌ ఎండీ మహువా ఆచార్య తెలిపారు.

ఎలక్ట్రిక్‌ విధానంలో ప్రజా రవాణా బస్సులను ప్రభుత్వ రవాణా సంస్థలు (ఎస్‌టీయూ) ఒక సర్వీసుగా ఉపయోగించుకుని, నిర్దిష్ట ఫీజులను చెల్లించే విధంగా ఎన్‌ఈబీపీని రూపొందించారు. దీని ప్రకారం ప్రైవేట్‌ ఆపరేటరు బస్సులను 10–12 ఏళ్ల పాటు నడిపిస్తారు. బస్సు సర్వీసు పొందినందుకు గాను ఎస్‌టీయూలు ఫీజులను చెల్లిస్తాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top