Telugu Techtuts Syed Hafeez: 'ఫోర్బ్స్‌ ఇండియా'లో సయ్యద్‌ హఫీజ్‌కు చోటు!

Telugu Techtuts Syed Hafiz Got A Place In Forbes India Top 100 Digital Stars - Sakshi

ప్రముఖ తెలుగు టెక్‌ కంటెంట్‌ క్రియేటర్‌ సయ్యద్‌ హఫీజ్‌కు అరుదైన గుర్తింపు లభించింది.  ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా విడుదల చేసిన ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌’ జాబితాలో చోటు దక్కింది.
 
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైంటిక్లైన్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ తెలుగు ప్రజలకు సుపరిచితుడే. ఉన్నత విద్యను చదవకపోయినా టెక్నాలజీపై తనకున్న మక్కువతో 2011 నుంచి హఫీజ్‌ 'తెలుగు టెక్‌ట్యూట్స్‌' పేరుతో వీడియో కంటెంట్‌ను అందిస్తున్నాడు. 

ముఖ్యంగా  అటు సోషల్‌ మీడియాను.. ఇటు టెక్నాలజీని ఉపయోగించి  డబ్బులు ఎలా సంపాదించాలి. మితిమీరిన టెక్నాలజీ వినియోగంతో రోజు రోజుకి పెరిగిపోతున్న ప్రమాదాల గురించి యూజర్లకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు మార్కెట్‌లో విడుదలైన లేటెస్ట్‌ గాడ్జెట్స్‌, స్మార్ట్‌ ఫోన్‌ రివ్వ్యూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ఆకట్టుకోవడాన్ని ఫోర్బ్స్‌ ఇండియా గుర్తించింది. 8.89 క్రియేట్‌ స్కోర్‌తో టాప్‌ 100 డిజిటల్‌ స్టార్ట్స్‌లో చోటు కల్పిచ్చింది.  

సయ్యద్‌ హఫీజ్‌ ఆదాయం ఎంతంటే 
టెక్‌ కంటెంట్‌తో యూజర్లకు ఆకట్టుకుంటున్న సయ్యద్‌ హఫీజ్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం 16లక్షల మంది సబ్‌ స్క్రైబర్లతో నెలకు రూ.2 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. 

ర్యాంకులు ఎలా ఇచ్చింది
ఫోర్బ్స్‌ ఇండియా, ఐఎన్‌సీఏ, గ్రూప్‌ ఎం సంస్థలు సంయుక్తంగా డిజటల్‌ స్టార్ట్స్‌ ఎంపిక చేసింది.  దేశ వ్యాప్తంగా కామెడీ, బ్యూటీ, ఫ్యాషన్‌, బిజినెస్‌, ఫిట్‌నెస్‌, ఫుడ్‌,టెక్‌, ట్రావెల్‌, సోషల్‌ వర్క్‌ ఇలా తొమ్మిది రకాల కంటెంట్‌తో యూజర్లను ఆకట్టుకుంటున్న 100కి ర్యాంకులు విధించింది.

ఆ 100మందిని ఎలా సెలక్ట్‌ చేసిందంటే 
టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌లో స్థానం సంపాదించిన కంటెంంట్‌ క్రియేటర్లు నెటిజన‍్లు ఆకట్టుకోవడంతో పాటు క్రియేట్‌ చేసే కంటెంట్‌ ఎంతమందికి రీచ్‌ అవుతుంది. ఎంత మంది ఆ కంటెంట్‌తో ఎంగేజ్‌ అవుతున్నారు. ఆ కంటెంట్‌ జెన్యూన్‌గా ఉందా? లేదా? ఇలా అన్నీ రకాలు పరిశీలించిన తర్వాతే ఈ జాబితాను విడుదల చేసినట్లు ఫోర్బ్స్‌ ఇండియా పేర్కొంది. ఈ లిస్ట్‌లో సయ్యద్‌ హఫీజ్‌ 32వ స్థానం దక్కడం గమనార్హం.

చదవండి: ఫోర్బ్స్‌ ధనవంతుల జాబితాలో ఇండో-అమెరికన్‌ మహిళలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top