టీసీఎస్‌కు కువైట్‌ బ్యాంక్‌ డీల్‌ | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌కు కువైట్‌ బ్యాంక్‌ డీల్‌

Published Thu, May 23 2024 8:01 AM

TCS gets deal from Kuwait Burgan Bank

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రముఖ కువైట్‌ బ్యాంకు డీల్‌ను దక్కించుకుంది. కువైట్‌లోని ప్రముఖ వాణిజ్య బ్యాంకు అయిన బుర్గాన్ బ్యాంక్ యొక్క కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి డీల్‌ కుదుర్చుకున్నట్లు టీసీఎస్‌ ప్రకటించింది.

ఈ డీల్‌లో భాగంగా బుర్గాన్ బ్యాంక్ బహుళ స్వతంత్ర లెగసీ అప్లికేషన్‌లను సమకాలీన సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్‌గా ఏకీకృతం చేయడంలో టీసీఎస్‌  సహాయం చేస్తుంది. 160కి పైగా శాఖలు, 360 ఏటీఎంల ప్రాంతీయ నెట్‌వర్క్‌తో కువైట్‌లోని అతి తక్కువ కాలంలో ఏర్పాటైన వాణిజ్య బ్యాంకులలో బుర్గాన్ బ్యాంక్ ఒకటి. అధిక లావాదేవీల వాల్యూమ్‌లను నిర్వహించడానికి, ఆటోమేషన్‌ను మెరుగుపరచడానికి, సిబ్బంది ఉత్పాదకతను మెరుగుపరచడానికి టీసీఎస్‌ అందించే పరిష్కారాన్ని బుర్గాన్ బ్యాంక్ అమలు చేయనుంది.

బుర్గాన్ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ డాహెర్ మాట్లాడుతూ కస్లమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ కోర్ సిస్టమ్‌ల ఆధునికీకరణపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. బుర్గాన్ బ్యాంక్ వంటి ప్రగతిశీల సంస్థతో భాగస్వామ్యం కావడం తమకు సంతోషంగా ఉందని టీసీఎస్‌ ఫైనాన్షియల్‌ సొల్యూషన్స్‌ గ్లోబల్‌ హెడ్‌ వెంకటేశ్వరన్‌ శ్రీనివాసన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement